Sunday, November 16, 2025
Homeనేషనల్PM Modi: బెంగుళూరు మెట్రో 'యెల్లో లైన్' ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: బెంగుళూరు మెట్రో ‘యెల్లో లైన్’ ప్రారంభించిన ప్రధాని మోదీ


PM Modi Launches Bengaluru Metro’s Yellow Line: దేశ ఆర్థిక రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బెంగుళూరు మెట్రో రైల్ “యెల్లో లైన్”ను ప్రారంభించారు. నగరంలోని ఐటీ హబ్‌లను కలుపుతూ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో ఈ లైన్ సేవలు అందించనుంది.

ఈ సందర్భంగా ఆర్.వి. రోడ్ (రాగిగుడ్డ) నుండి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. రూ. 7,160 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ యెల్లో లైన్ మొత్తం 19 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ మార్గంలో 16 స్టేషన్లు ఉన్నాయి.
ఈ లైన్ ప్రారంభంతో బెంగుళూరులోని మెట్రో రైల్ నెట్‌వర్క్ మొత్తం 96 కిలోమీటర్లకు పెరిగింది. హోసూర్ రోడ్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సైతం..

- Advertisement -

అదేవిధంగా, ప్రధాని మోదీ కె.ఎస్.ఆర్. బెంగుళూరు – బెళగావి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా జెండా ఊపి ప్రారంభించారు.

యెల్లో లైన్.. టెక్ కారిడార్‌కు ‘గొప్ప వరం’

ఈ యెల్లో లైన్ ప్రారంభంపై ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా హర్షం వ్యక్తం చేశారు. ఇది బెంగుళూరులోని టెక్ కారిడార్‌కు ‘గొప్ప వరం’ అని, ఈ లైన్ కోసం నగర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శోభా కరంద్లాజె, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ పాల్గొన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad