ప్రధాన మోదీ(PM Modi) విదేశీ పర్యటనకు బయల్దేరారు. నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
“వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాబోయే కొన్ని రోజులు ఫ్రాన్స్, అమెరికాలో ఉంటాను. ఫ్రాన్స్‌లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటాను. ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతాను. మార్సిల్లేలో కాన్సులేట్‌ను కూడా ప్రారంభించనున్నాను” అని తెలిపారు.
“అలాగే వాషింగ్టన్ DCలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ పర్యటన భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. వివిధ రంగాలలో సంబంధాలను పెంచుతుంది. ట్రంప్ తొలి విడత పదవీకాలంలో ఆయనతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాను సహృద్భావ వాతావరణంలో కొనసాగుతాయని ఆశిస్తున్నాను” అని వెల్లడించారు.