ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా (Kumbh Mela)కు ప్రధానమంత్రి మోదీ(PM Modi) హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి అరైల్ ఘాట్‌కు వెళ్లారు.
- Advertisement -
ఘాట్ నుంచి బోటులో సీఎం యోగితో కలిసి కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. చివరగా త్రివేణి సంగమం వద్ద పవిత్ర పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న తరుణంలో మోదీ మహాకుంభమేళాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.