ఇటీవల కాలంలో భార్యల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. భార్యలు పెట్టే టార్చర్లు భరించలేక భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరగడం కలకలం రేపుతోంది. బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య వేధింపులతో సూసైడ్ చేసుకోగా.. ఇలాగే పలు రాష్ట్రాల్లో భర్తలు ఆత్మహత్య చేసుకోవడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టాలు భార్యలకే అనుకూలంగా ఉన్నాయని.. చట్టాల్లో ఉన్న లొసుగులతో భర్తలను వేధిస్తున్నారనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగానే తాజాగా ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.
ఒడిశాకు చెందిన ర్యాపర్(Rapper) అభినవ్ సింగ్(Abhinav Singh) భార్య వేధింపులు భరించలేక బెంళూరులో విషం తాగా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమె కుటుంబీకుల మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు సూసైడ్ చేసుకున్నారంటూ అతడి తండ్రి బిజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.