Sunday, July 7, 2024
Homeనేషనల్Rahul Gandhi: రాహుల్ యాత్రలో మోదీ అనుకూల నినాదాలు.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్

Rahul Gandhi: రాహుల్ యాత్రలో మోదీ అనుకూల నినాదాలు.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ పాదయాత్ర చేస్తుండగా కొందరు మోదీ అనుకూల నినాదాలు చేశారు. వారికి రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం విశేషం.

- Advertisement -

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా ప్రాంతంలో ఆదివారం జరిగింది. ఆదివారం మధ్యప్రదేశ్‌లో ఆయన పర్యటన చివరి రోజు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. అయితే, రాహుల్ పాదయాత్ర చేస్తున్నప్పుడు జనంలోంచి కొందరు మోదీ అనుకూల నినాదాలు చేశారు. రాహుల్ ఏమాత్రం ఆందోళన పడకుండా వారివైపు చూస్తూ చిరునవ్వుతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు.

సోమవారం నుంచి ఆయన పాదయాత్ర రాజస్థాన్‌లో సాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లో రాహుల్‌కు స్వాగతం పలుకుతూ భారీ సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, తదితర నేతలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News