Friday, November 22, 2024
Homeనేషనల్Rahul Jodo yatra: రాహుల్ కు షాకిచ్చిన యంగ్ టర్క్, BJY యూపీ టూర్ లో...

Rahul Jodo yatra: రాహుల్ కు షాకిచ్చిన యంగ్ టర్క్, BJY యూపీ టూర్ లో చాలా ట్విస్టులు..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (BJY) ఉత్తర్ ప్రదేశ్ లో జనవరి 3 తేదీన ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా యూపీలోని బీజేపీయేతర పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు పంపింది. ఇలా ఆహ్వానాలు అందుకున్న వారిలో మాయావతి, అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్ తోపాటు ఆర్ఎల్డీ నేత జయంత్ సింగ్ చౌదరి కూడా ఉన్నారు.

- Advertisement -

కానీ.. “ ఈ యాత్రకు నేను రానంటూ జయంత్ తేల్చి” చెప్పి, రాహుల్ కు షాక్ ఇచ్చారు. రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ ఇచ్చిన స్ట్రోక్ కు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. ఇలాంటి షాకులన్నింటినీ అధిగమిస్తూ యూపీలో విజయవంతంగా యాత్రను ఫినిష్ చేయాలన్న లక్ష్యంలో ఉన్న బీజేవై టీం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన ప్రియాంక గాంధీని యూపీ అంతటా రాహుల్ తోపాటు నడిచేలా ప్లాన్ చేయటం హైలైట్. ఇది నిజంగానే కాంగ్రెస్ జోడో యాత్రలానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

యాత్రకు హాజరైన వారిపై ఐబీ కొరడా ఝుళిపిస్తోందని, ఏదో ఒకరకమైన డిపార్ట్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తూ యాత్రకు వస్తున్న ప్రముఖులను కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ ఆరోపించటం పలువురు నేతలను ఇప్పుడు ఆలోచింపచేస్తోంది. పాదయాత్రలో రాహుల్ ను కలిసిన ప్రముఖులను ఐబీ ప్రశ్నించటంపై కాంగ్రెస్ మండిపడుతోంది. దెబ్బకు ఇప్పుడు మలివిడత యాత్రలో పాల్గొనాలంటే రాజకీయ, సినీ ప్రముఖులు బెదిరిపోతున్నారు.

కాగా తన ముత్తాత నెహ్రూ హయాంలో దేశ విభజన జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను భారత్ లో కాకుండా పాకిస్థాన్, బాంగ్లాదేశ్ లో జరపటం కరెక్టుగా ఉంటుందంటూ యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌధరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News