Sunday, October 6, 2024
Homeనేషనల్Kerala PETA: గుళ్లో రోబో ఏనుగు

Kerala PETA: గుళ్లో రోబో ఏనుగు

మెకానికల్ ఏనుగును ఏర్పాటు చేసి, గుళ్లోని సంప్రదాయాలను పూర్తి చేసే విధానం అనుసరిస్తోంది కేరళలోని ఓ గుడి. కేరళలోని త్రిస్సూర్ లోని ఇరింజడపిల్లి శ్రీకృష్ణుడి ఆలయంలో అచ్చం నిజం ఏనుగు అనిపించేలాంటి రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. పెటా సంస్థ ఈ ఏనుగును గుడికి అందజేసింది. పార్వతి తిరువొత్తు అనే యాక్టర్ ఇందుకు అవసరమైన సపోర్ట్ పెటా సంస్థకు అందించారు.

- Advertisement -

పదిన్నర అడుగుల ఎత్తున్న ఈ ఏనుకు బరువు 800 కేజీల పైమాటే. నలుగురు మనుషులను ఇది తనపై సవారీకి తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉండేలా రోబో ఎలిఫెంట్ ను రూపొందించారు. ఇక ఈ ఏనుగుకున్న చెవులు, తోక, కళ్లు, మూతి అన్నీ మీకు చాలా సహజంగా కనిపిస్తాయి. పైగా కనుగుడ్లు తిప్పుతుంది, తోకను కూడా కదిలించేలా ఈ భారీ ఏనుగు ఉండటం హైలైట్. తమ గుళ్లో ఎటువంటి జంతువులను ఇకమీదట ప్రయోగించకూడదని ఆలయ అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో పెటా ఈ బహుమతిని ఇచ్చి ఆకట్టుకుంటోంది. కేరళ గుళ్లలో ఏనుగులతో పలు సేవలు చేయించటం ఆచారంగా వస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News