గర్వప్రదమైన గౌరవ సంఘీభావ తీర్థయాత్ర లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ నేతృత్వంలో 2024 సెప్టెంబర్ 3 న ఉదయం, వివిధ రాష్ట్రాల కు చెందిన పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)కి ప్రాతినిధ్యం వహిస్తున్న 28 మంది సభ్యుల పోలీసు అధికారుల బృందం లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ మెమోరియల్ వద్ద సమావేశమైంది. ఈ బృందానికి డిప్యూటీ లీడర్‌గా తెలంగాణ పోలీస్ డిఐజి ఎన్. ప్రకాష్ రెడ్డి వ్యవహరించారు. సంఘీభావ ప్రదర్శనలో, ఐటిబిపి, ఐటిబిఎఫ్, మరియు అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో వాస్తవ ఆధీన రేఖ వద్ద జాగ్రత్తగా విధులు నిర్వర్థిస్తున్న ఇండియన్ ఆర్మీకి చెందిన అధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
1959 అక్టోబర్ 21న చైనీస్ దళాలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచిన పెట్రోలింగ్ పార్టీ సభ్యుడు, 86 ఏళ్ల అనుభవజ్ఞుడు స్వభాష : తెలుగు గౌరవ సోనమ్ దోర్జీని కలిసిన అరుదైన ఘనత కూడా ఈ పోలీసు ప్రతినిధి బృందానికి లభించింది. అయన దృఢత్వం మరియు ధైర్యం చరిత్రలో స్ఫూర్తిదాయకమైన అధ్యాయం.
15,400 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం, పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది చారిత్రాత్మక పరాక్రమానికి నిదర్శనం. అక్టోబర్ 21, 1959న తూర్పు లడఖ్‌లో జరిగిన ఈ సంఘటన జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నం భారతీయ పోలీసు బలగాలకు పవిత్ర స్థలంగా నిలిచింది. 1960లో ప్రారంభమైన ఈ స్మారక వేడుక దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు గౌరవనీయ సంప్రదాయంగా నిలిచింది.
ఈ సంవత్సరపు తీర్థయాత్ర ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది, ఎందుకంటే మనోజ్ యాదవ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ .పి .ఎఫ్ )డైరెక్టర్ జనరల్‌గా బృందానికి నేతృత్వం వహించిన మొదటి వ్యక్తి అయ్యారు. వివిధ బలగాల పోలీసు అధికారులతో కలిసి ఆయన పాల్గొనడం, భారతదేశంలోని వివిధ పోలీసు బలగాల మధ్య ఐక్యత, బలం మరియు స్నేహాన్ని బలపరుస్తుంది. 1958లో ఆర్‌పిఎఫ్ ప్రారంభమైనప్పటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 1011 మంది ధైర్యవంతులైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి ఈ తీర్థయాత్రను అంకితం చేస్తూ, డీజీ ఆర్‌పిఎఫ్ 1959లో అమరులైన వీరుల చూపిన విధి, శౌర్యం, త్యాగం స్ఫూర్తిని ఆర్‌పిఎఫ్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని పునరుద్ఘాటించారు.
మనోజ్ యాదవ్ ఈ గంభీరమైన కార్యక్రమంలో పాల్గొనడం, చట్టాన్ని అమలు చేసే సంఘంలోని సభ్యులందరికీ స్ఫూర్తినిచ్చే సంఘటనగా నిలిచింది. ఇది దేశ సేవలో పోలీసు అధికారులు చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ, భారతీయ పోలీసు సోదరత్వాన్ని నిర్వచించే కర్తవ్యం, శౌర్యం, నిబద్ధత శాశ్వత స్ఫూర్తిని మరింత బలపరుస్థుందని తెలిపారు.