కోలార్ అంటే మీకు కేజీఎఫ్ సినిమా, కోలార్ గోల్డ్ మైన్స్ ఠకీమని గుర్తుకొస్తాయి కదా. కానీ ఇక మీదట మీకు మోడీ పేరున్నవారంతా దొంగలని రాహుల్ అన్న మాటలు కూడా గుర్తుకురాక తప్పదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ కోలార్ లో ప్రచారం చేస్తూనే రాహుల్ గాంధీ నోరు తూలి ఈ మాట మాట్లాడగా, అది కాస్తా పరువు నష్టం కేసుగా మారి ఏకంగా ఎంపీగా అనర్హుడై, 2 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 8 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండేలా శిక్ష పడిందన్నమాట. ఇంత కథ ఇప్పుడెందుకంటే మళ్లీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. ఈరోజు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో పార్టీకి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేయనున్న రాహుల్ ఈసారి ప్రచారాన్ని ఈ వివాదాస్పద కోలార్ నుంచే మొదలు పెడతానని వెల్లడించటం విశేషం.
ఏప్రిల్ 5న కోలార్ లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనటం ఖాయమైంది. ఇక్కడ సత్యమేవ జయతే అనే పేరుతో ఈయన ర్యాలీ చేపట్టనుండటం మరో విశేషం. అయితే రాహుల్ ఈసారి ఇక్కడ ఇంకెలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారోనంటూ అందరూ ఆసక్తిగా అప్పుడే ఎదురు చూడటం కూడా స్టార్ట్ అయిపోయింది.