Sunday, November 16, 2025
Homeనేషనల్Revanth Reddy: మీ రాజకీయాలకు కోర్టు వేదిక కాదు.. రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత

Revanth Reddy: మీ రాజకీయాలకు కోర్టు వేదిక కాదు.. రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత

సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై దాఖలు పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవడానికి అంగీకరించలేదు.  2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీపై రాష్ట్ర రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల ప్రకటనలపై దాఖలైన పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పరువునష్టం కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఇలాంటి కేసులో ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది.

- Advertisement -

ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ అటుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. ఈ సందర్భంగా రాజకీయ పోరాటాల కోసం కోర్టులను ఉపయోగించవద్దని బీజేపీని మందలించింది.

రాజకీయాల్లో ఉండాలటే అవతలి నేతలు చేసే విమర్శలను తట్టుకునేలా ఉండాలని పిటిషనర్ ,బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లుకు సూచించింది.

ఈ సందర్భంగా ‘మేము మళ్లీ మళ్లీ చెబుతున్నాం – రాజకీయ పోరాటాలకు కోసం కోర్టును వేదికగా వాడవద్దు. మీరు రాజకీయ నాయకుడైతే రాజకీయ విమర్శలను భరించే శక్తి ఉండాలి. మీరు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’ అని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ..బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారని.. ఆయన వ్యాఖ్యలు మోసపూరితమైనవి..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్ దాఖలైంది.

2024 ఆగస్టులో ట్రయల్ కోర్టు, రేవంత్ రెడ్డికి నోటీసు జారీ చేసి, ప్రాథమిక కేసు నమోదైంది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, గత నెలలో హైకోర్టు ఆయన పిటిషన్‌ను అనుమతించింది. కేసును కొట్టివేసింది.

ఆగస్టు 1న జస్టిస్ కె. లక్ష్మణ్ ఇచ్చిన తీర్పులో, రేవంత్ ప్రసంగం బీజేపీని ఉద్దేశించిందని, తెలంగాణకు సంబంధం లేదని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరమైనవని..పిటిషనర్‌ను వ్యక్తిగతంగా దూషించలేదని న్యాయస్థానం తేల్చింది. ఇందులో అతని పరువుకు భంగం కలింది ఏమీ లేదని స్పప్టం చేసింది. పిటిషన్ వాదనలో మెరిట్ లేదని గుర్తు చేసింది.

కాగా కాసం వెంకటేశ్వర్లు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

రేవంత్ రెడ్డి తరఫున కాంగ్రెస్ సీనియర్ అభిషేక్ సింఘ్వీ మను వాదించగా..పిటిషనర్ తరఫున రంజిత్ కుమార్, గురుకృష్ణ కుమార్‌లు వాదించారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad