Monday, November 17, 2025
Homeనేషనల్Parliament: పార్లమెంటు భవనంలో మరోసారి బయటపడ్డ భద్రతావైఫల్యం..!

Parliament: పార్లమెంటు భవనంలో మరోసారి బయటపడ్డ భద్రతావైఫల్యం..!

Parliament: పార్లమెంటు భవనంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శుక్రవారం అనుమానాస్పద వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆగస్టు 22న ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి చెట్టు సహాయంతో ప్రహారీ గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనం గరుడ గేటు వద్దకు చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పార్లమెంట్ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేస్తున్నారు. అతడు సూరత్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఓ వ్యక్తి పార్లమెంటు గోడపై నుండి దూకుతున్నట్లు పీసీఆర్ సిబ్బంది చూశారు. అక్కడ గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో దుండగుడు లోపలికి వచ్చినట్లు భద్రతా దళాలు తెలిపాయి. పీసీఆర్ సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు, పారిపోయేందుకు యత్నించాడని వెల్లడించాయి. ఆ శబ్దం విన్న CISF అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ప్రసత్తం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సెల్, IB, ఇతర సంస్థలు అతన్ని విచారిస్తున్నాయి. ఎత్తుగా ఉన్న గోడను అతడు ఎలా ఎక్కాడు? ఎందుకు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Read Also: EPS pension: ఒక్కశాతం కన్నా తక్కువ మందికే రూ.6 వేల పెన్షన్

గతంలోనూ..

మరోవైపు, పార్లమెంటులో భద్రతా వైఫల్యాలు బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. గతేడాది ఆగస్టులో 20 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్‌ ఖాన్‌ మార్గ్‌వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్‌ అనెక్స్‌ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అతడిని గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధరించుకున్న తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు కూడా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల వేళ లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు అయిన డిసెంబరు 13న ఆ ఘటన తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభలోని పబ్లిక్‌ గ్యాలరీ వద్ద కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంట్‌ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదే రకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Read Also: Ajinkya Rahane: కెప్టెన్సీ వదిలేసిన రహానే.. షాక్ లో ఫ్యాన్స్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad