మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మిగతా సీఎంలకంటే భిన్నమైన సీఎం అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తన ఇమేజ్ గ్రాఫ్ ఏమాత్రం పడిపోకుండా ఆయన దాన్ని చక్కగా కాపాడుకుంటున్నారు. తాజాగా ఓ గిరిజనుడి పాదాలు కడిగి, క్షమాపణలు సైతం చెప్పి, బాధిత గిరిజనుడిని తన స్నేహితుడుగా చెప్పుకోవటం వైరల్ అవుతోంది.
కాళ్లు కడిగి కన్యాదానాలు చేయటంలో, కన్యా పూజ చేయటంలో ఎప్పుడూ ముందుండే చౌహాన్ తాజాగా ఓ బాధిత గిరిజనుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని ఇలా మర్యాదించటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్రం చేసే క్లిప్ వైరల్ కాగా, ఆ వీడియోలోని బాధితుడి దస్మత్ రావత్ కు సీఎం చౌహాన్ ఇలా ప్రత్యేక మర్యాద చేశారు. బాధితుడు 36 ఏళ్ల ఇతని సొంత ఊరు కరౌండి కాగా తగు మర్యాద ఇచ్చి, అతని బాగోగులు, ఉపాధి వంటి విషయాలన్నీ విచారించారు కూడా. అంతే కాదు అతను తనపాలిట సుధాముడని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ మొత్తం విషయాన్ని ట్విట్టర్లో శివరాజ్ సింగ్ అధికారికంగా పోస్ట్ చేయటం హైలైట్.