Sunday, November 16, 2025
Homeనేషనల్Indian Railways: సింహస్థ కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..!

Indian Railways: సింహస్థ కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..!

Simhastha Kumbhamela: గోదావరి తీరంలో జరిగే సింహస్థ కుంభమేళాకు కేంద్ర రైల్వే శాఖ సమాయత్తం అవుతుంది. నాసిక్ – త్రయంబకేశ్వర్ సింహస్థ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఈ ప్రణాళికలను విస్తృతంగా సమీక్షించారు.

- Advertisement -

2025 మహా కుంభమేళా అనుభవంతో నాసిక్‌, నాసిక్ నగరం సమీపంలోని స్టేషన్లలో తగిన సౌకర్యాలను అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కుంభమేళా ప్రాంతానికి సమీపంలో ఉన్న 5 కీలక స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా అవసరమగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేసారు. సింహస్థ కుంభమేళాకు నాసిక్ రోడ్, దేవ్లాలి, ఓధా, ఖేర్వాడి, కస్బే సుకేనే స్టేషన్లు అందుబాటులో ఉంటాయి.

Readmore: https://teluguprabha.net/national-news/rahul-gandhi-caste-census-mistake-obc-rahul-gandhi-on-obcs/

ఈ 5 స్టేషన్లలో ప్రతిపాదించబడిన మౌలిక సదుపాయాల పనులు, ప్రయాణీకుల సౌకర్యాల వివరాలను బట్టి.. ప్రణాళిక చేయబడిన పనులకు రూ.1,011 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు  అంచనా వేశారు.

ఈ పనులను రానున్న రెండు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాలమీ రైల్వే అధికారులకు ఆదేశించారు. మొత్తం 65 ప్రతిపాదిత పనులలో 33 పనులకు ఇప్పటికే అంచనాలు మంజూరు చేయబడ్డాయి. సింహస్థ కుంభమేళాకు దాదాపు 3 కోట్లకు పైగా యాత్రికులు వస్తారని అంచనా వేశారు. ఇది 2015 సింహస్థ కంటే దాదాపు 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రైల్వేలు గణనీయంగా ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోంది.

Readmore: https://teluguprabha.net/national-news/prime-minister-modi-became-most-popular-leader-in-the-world-again/

కుంభమేళాకు వచ్చే యాత్రికుల కోసం నాసిక్‌ను కామాఖ్య, హౌరా, పాట్నా, ఢిల్లీ, జైపూర్, బికనీర్, ముంబై, పూణే, నాగ్‌పూర్, నాందేడ్ వంటి ముఖ్యమైన స్టేషన్లకు అనుసంధానిస్తూ ప్రత్యేక రైళ్లు, స్వల్ప-దూర మెము సేవలు అందించబడతాయని తెలిపారు. 3 జ్యోతిర్లింగాలు త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, ఓంకారేశ్వర్ లను దర్శించేలా రౌండ్-ట్రిప్ స్పెషల్ సర్క్యూట్ రైలు కూడా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి స్టేషన్ లో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు అమర్చాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad