Saturday, November 15, 2025
Homeనేషనల్Telangana Cyber Security Bureau got national Award: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు...

Telangana Cyber Security Bureau got national Award: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు జాతీయ అవార్డు

సైబర్ నేరాల కట్టడికి 'సమన్వయ్'

సైబర్ నేరాల (cyber security) నియంత్రణలో ఉత్తమ పనితీరును కనబరిచి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రథమ వార్షికోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆ ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ గారికి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ కి సీఎం ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు.

- Advertisement -

సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో ‘సమన్వయ్’ పేరుతో అనుసంధాన వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషించిన పాత్రకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికల్లోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషించాలని సీఎం అభిలషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad