Saturday, November 23, 2024
Homeనేషనల్The best PS in India is Rajendra Nagar PS: రాజేంద్ర నగర్...

The best PS in India is Rajendra Nagar PS: రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర బాబు ను అభినందించిన డిజిపి రవిగుప్తా

కశ్మీర్, వెస్ట్ బెంగాల్ 2, 3 స్థానాల్లో..

అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్రనగర్ కాగా ద్వితీయ, తృతీయ స్థానాలను కాశ్మీర్ , వెస్ట్ బెంగాల్ లు గెలుచుకున్నాయి.

- Advertisement -

దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జైపూర్ లో జరిగిన డీజీపీల సదస్సులో ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ బి నాగేంద్రబాబు ట్రోఫీ అందుకున్నారు. 2023 సంవత్సరంలో దేశంలో ఉన్న దాదాపు 17 వేలకు పైగా ఉన్న పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు ప్రథమ బహుమతిని గెలుచుకోగా ద్వితీయ, తృతీయ బహుమతులను కాశ్మీర్ , వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు గెలుచుకున్నాయి.

పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా వివిధ ప్రామాణికాలను పరిశీలించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ రకాల కేసుల దర్యాప్తు జరిగిన తీరు ఆధారంగా మరియు పోలీస్ స్టేషన్ భవన నిర్వహణ తదితర అంశాలు ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించి ఈ బహుమతులను ప్రకటిస్తారు. సీసీటీఎన్ఎస్ ద్వారా రెండవ దశలో 75 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేసి చివరకు దేశంలోనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ను అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శుక్రవారం నాడు జైపూర్ లో జరుగుతున్న డీజీపీల సదస్సులో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా రాష్ట్ర డిజిపి రవి గుప్తా అభినందించారు. ఇటీవల రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఉందని తెలుసుకున్న రవి గుప్తా, అడిషనల్ డిజిపి శిఖా గోయల్ లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, నాటి డిసిపి జగదీశ్వర్ రెడ్డి, తదితరులను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News