భాతర ప్రధాని మోదీ(PM Modi) ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మోదీ విమానమే లక్ష్యంగా టెర్రరిస్టులు దాడి చేయవచ్చనే సమాచారం తమకు అందిందని ముంబై పోలీసులు వెల్లడించారు. దీంతో వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని తెలిపారు. తమకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై ముమ్మర దర్యాప్తు చేశామని పేర్కొన్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. అయితే అతడి మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోందన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.