Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుGujarat : ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లపై కానిస్టేబుల్ కాల్పులు..ఇద్దరు మృతి

Gujarat : ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లపై కానిస్టేబుల్ కాల్పులు..ఇద్దరు మృతి

ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో బుల్లెట్ తగిలి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోర్ బందర్ సమీపంలోని తుక్డా గోసా గ్రామంలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అవి సజావుగా సాగేందుకు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా.. పోర్ బందర్ చేరుకున్న జవాన్లకు అధికారులు సమీపంలోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఎన్నికలకు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం రాత్రి కొందరు జవాన్లు బస్సులో వెళ్తుండగా.. ఇద్దరు జవాన్ల మధ్య వివాదం రేగింది. అదికాస్తా పెరగడంతో కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరాజిత్, రోహికానా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిని జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు పోర్ బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News