Ukrainian couple: ఈ రోజుల్లో పెళ్లిళ్లను ఘనంగా చేసుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. పైగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ ఇండియాలో పీక్స్ లో ఉంది. అందుకే చాలా మంది తమ పెళ్లిన జీవితాతం గుర్తుండిపోయేలా రాజస్థాన్, జైపూర్ లాంటి నగరాల్లో అందమైన కోటల వద్ద జరుపుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ కి చెందిన ఒక జంట భారతీయ సంస్కృతిలో వైభవంగా జరుపుకున్న వివాహం సోషల్ మీడియాను తెగ షేక్ చేసేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ చారిత్రక కోటలు, కలల పెళ్లిళ్లకు పేరుగాంచింది. వయసు, దేశం, సంప్రదాయం లాంటివి పక్కన పెట్టి ఉక్రెయిన్ కి చెందిన 72 ఏళ్ల స్టానిస్లావ్ అనే వరుడు 27 ఏళ్ల అంగెలినా వధువు హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. బాలీవుడ్ సినిమాలు.. రాజస్థానీ పెళ్లి వీడియోలు చూసి ఆకర్షితురాలైన అంగెలినా తన జీవితంలో ప్రత్యేకమైన రోజు సంప్రదాయ భారతీయ వధువు రూపంలో కావాలని కోరుకుంది. ఆమె ఎర్రటి లెహంగా ధరించి, వధువుగా మెరిసింది. ఇదే సమయంలో వరుడు స్టానిస్లావ్ కూడా శేరువాణీ, పాగ్ ధరించి సాంప్రదాయ భారతీయ పద్ధతిలో కనిపించాడు.
View this post on Instagram
వారి పెళ్లి మొదలైన క్షణం నుంచే వేదిక పండుగ వాతావరణాన్ని దాల్చింది. బారాత్ శోభాయాత్ర సడక్‌పై అడుగుపెట్టింది, ఢోలకీ ఢమరుక ధ్వనుల మధ్య స్టానిస్లావ్ ఉత్సాహంగా నృత్యం చేశాడు. అతడి వయసు ఆ క్షణంలో ఎవరికీ గుర్తుకురాలేదు.. మిగతా అతిథుల్లాగానే ఆయన హర్షోల్లాసాలతో మెరిసిపోయాడు. అంగెలినా మెడలో మాల వేసిన వెంటనే ఆ క్షణం అందరికీ సంతోషకర దృశ్యం కలిగించింది. దీని తర్వాత అగ్ని సాక్షిగా మూడు ముళ్లతో.. ఏడు అడుగులు వేసిన జంట, జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ఉంటామని ప్రమాణం చేశారు. చివరగా వరుడు సింధూరం పెట్టగా, అక్కడి వాతావరణం సంపూర్ణ భారతీయ పెళ్లి శోభతో నిండిపోయింది.
ఈ జంట పెళ్లికి ముందు నుంచే సహజీవనం చేస్తున్నారు. వయస్సు తేడా లేదా మూలాల భేదం ప్రేమను ఎవ్వరూ ఆపలేవని ఈ జంట నిరూపించింది. జోధ్‌పూర్ ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ గా మారిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఉక్రెయినియన్ జంట పెళ్లి ఆ నగరానికి మరొక ప్రత్యేక చరిత్రను సృష్టించింది.


