ఎముకలు కొరికే చలి.. గజగజలాడలేక ఛస్తున్నాం..వామ్మో ఇంత చలి ఎప్పుడూ చూడలేదంటున్నారు నార్త్ వెస్ట్రన్ రాష్ట్రాల ప్రజలు. ఈనెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం నుంచి ఢిల్లీ, ఢిల్లీని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో అతి చల్ల గాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది. సో ఉత్తరాది వారికి ఫ్రాస్టీ మార్నింగ్స్, కోల్డ్ బ్లాస్ట్ తప్పదని ఐఎండీ హెచ్చరిస్తోంది. దీంతో జనవరి 2023 చరిత్రలోనే రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలున్న నెలగా రికార్డులకు ఎక్కనుంది. కశ్మీర్ లో భారీగా హిమపాతం, మంచు వర్షం ఉండనుంది. హిమాచల్, ఉత్తరాఖండ్ లోనూ ఇలాగే భారీ మంచు వాన సూచనలున్నాయి.
Winter alert: -4 డిగ్రీలు..వామ్మో ఇంత చలి ఎప్పుడూ చూడలేదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES