Wednesday, October 30, 2024
HomeఆటMandamarri: వార్షిక క్రీడల్లో నియర్ బై హాకీ టోర్నమెంట్

Mandamarri: వార్షిక క్రీడల్లో నియర్ బై హాకీ టోర్నమెంట్

ఆటలు ఆడండి..

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియ ఎస్.సి.ఎచ్.ఎస్ గ్రౌండ్ లో డబ్ల్యూ పిఎస్ అండ్ జిఎం వారి ఆధ్వర్యంలో బుధవారం 60వ వార్షిక క్రీడలలో భాగంగా నియర్ బై హాకీ టోర్నమెంట్ కు ముఖ్య అతిథి, స్టోర్ ఇంచార్జి పైడి ఈశ్వర్, ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సర్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -

ఈ టోర్నమెంట్ లో విన్నెర్స్ గా మందమర్రి గ్రూప్, రన్నర్స్ గా బెల్లంపల్లి గ్రూప్ లు నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ సి.ఎం.డి బలరాం నాయక్ ఆదేశాల మేరకు సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహిస్తామని, ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కళాకారులు కోల్ ఇండియా స్థాయిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతులు సాధించి సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారని వివరించారు. సీనియర్ క్రీడాకారులు, సంస్థలో పనిచేస్తున్న యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో క్రీడల కార్యదర్శి కార్తీక్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఏఐటీయూసి సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, బాణయ్యలు, గాండ్ల సంపత్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్ శివ కృష్ణ, జనరల్ క్యాప్టెన్ శాఖ శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News