Alternative Scooters for Honda Activa 110: ప్రస్తుతం దేశంలో స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎక్కువగా జనాలు వీటిని సాధారణ వినియోగాలతో పాటు ఇంటి పనుల కోసం సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ విభాగంలో హోండా కంపెనీకి చెందిన స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇక 110 సీసీ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా 110 టాప్‌లో ఉంది. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇది మార్కెట్‌లో కేవలం రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది లీటరుకు 45 కిలోమీటర్ల స్పష్టమైన మైలేజీని ఇస్తుంది. అందువల్ల జనాలు ఈ స్కూటర్‌ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇవే ఫీచర్లు, మైలేజీ, ధరలో మరికొన్ని ప్రత్యామ్నాయ స్కూటర్లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆ స్కూటర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
హీరో జూమ్ 110 (Hero Xoom 110): ఈ స్కూటర్ హోండా యాక్టివా 110కి గట్టి పోటీదారుగా ఉంది. అయితే దీని ధర కూడా చాలా తక్కువే. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 72,000 నుంచి రూ. 84,000 మధ్య ఉంది. ఈ స్కూటర్‌ని బ్లూ, స్పోర్ట్ రెడ్, బ్లాక్, మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో జనాలు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ 110.9 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 53 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది.
టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110): ఇది హోండా బ్రాండ్‌కి నేరుగా గట్టి పోటీని ఇస్తుంది. ఈ స్కూటర్ ధర మార్కెట్‌లో రూ. 77,000 నుంచి రూ. 90,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. బ్లూ, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లో వంటి ప్రత్యేక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.113 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేసే ఈ జూపిటర్ 110 స్కూటర్ లీటరుకు 48 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus): హోండాకు ప్రత్యామ్నాయంగా ఉన్న మరో స్కూటర్ హీరో ప్లెజర్ ప్లస్. ఇది తక్కువ బరువు, క్రేజీ డిజైన్‌తో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 71,000 నుంచి రూ. 83,000 మధ్య ఉంది. ఈ స్కూటర్ పర్ల్ సిల్వర్ వైట్, బ్లూయిష్ టీల్, ఆరెంజ్ బ్లూ వంటి ఆకట్టుకునే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ 110 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.