Sunday, September 8, 2024
HomeNewsAutism: ఆటిజం..అవగాహనతో నయం

Autism: ఆటిజం..అవగాహనతో నయం

ఆటపాటలు.. ముద్దు ముద్దు మాటలతో మురిపించాల్సిన చిన్నారులు.. కదలకుండా మెదలకుండా ఉంటే వారిని కచ్చితంగా పట్టించుకోవాల్సిందే… కొంతమంది చిన్నారులు వారి సహజ స్వభావానికి భిన్నంగాప్రవర్తిస్తుంటారు. సాటి పిల్లలతో కలిసి ఆడుకోరు. అందరితో పాటు చురుకుగా .. దూకుడుగా ఉత్సాహంగా ఉండరు. ఎవరితోనూ, కలవకుండా ఒంటరిగా ఉంటారు. వారి చూపు స్థిరంగా ఉండదు.. మాటలు కూడా స్పష్టంగా మాట్లాడలేరు. సొంత పనులు కూడా చేసుకోలేక ఇతరులపై ఆధారపడతారు. వైద్య పరిభాషలో  ఆ లక్షణాలను ఆటిజం అంటారు. ప్రపంచవ్యాప్తంగా   మాటలు కూడా వారు సరిగ్గా మాట్లాడరు. సొంత పనులు కూడా చేసుకోలేరు. ప్రతి పనికి  మరొకరిపై ఆధారపడుతుంటారు… ఇవే  ప్రపంచవ్యాప్తంగా ప్రతి వందమంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం సమస్యతో బాధ పడుతుండగా,  ఆటిజం సమస్యను అధిగమించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని  వైద్యులు అంటున్నారు.ఈ సమస్యను అధిగమించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ మాసంలో ఆటిజం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోంది. 2008 సంవత్సరం నుండి ఏప్రిల్‌ 2వ తేదీని ప్రపంచ ఆటిజం దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోంది.

- Advertisement -

ఆటిజం లక్షణాలు

పిల్లలు చురుకుగా వ్యవహరించకుండా, ఎవరితోనూ కలవకుండా,  ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, సరిగా మాట్లాడలేక పోతుండడం వంటి లక్షణాలను మందబుద్ధి.. ఆటిజం అని పిలుస్తారు. తల్లి దగ్గరకు  తీసుకుంటున్నప్పటికీ.. చిన్నారి సరిగా స్పందించకపోవడం ఆటిజం మరో లక్షణం. పసిపిల్లలు 3 నెలల వయసు నుండే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్లలో  కళ్లు పెట్టి నవ్వితే నవ్వుతారు. అయితే ‘ఆటిజం’ పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ, తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే  మన వైపు చూడరు. ‘ఆటిజం’లో ఇదొక ప్రధాన లక్షణం. మన దేశంలో దాదాపు 2 శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదల లోపం  తల్లిదండ్రులకు తీరని వేదనగా మారుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఆటిజం అనేది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే రుగ్మతల్లో ఒకటి. ఇది అనేక రకాల లక్షణాల ద్వారా  బయటపడుతుంది.ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్‌ ఏక్టివిటీ డిజార్డర్‌  వంటి  సమస్యలను కలిగి ఉంటారు.

ప్రపంచ ఆటిజం అవగాహన దినం

ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయం చేయవలసిన అవసరాన్ని  ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి, వారు సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా గుర్తింపు పొందడానికి, అర్థవంతమైన జీవితాలను ఆస్వాదించడానికి, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ   ఏప్రిల్‌ 2వ తేదీని అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినంగా ప్రకటించింది. పిల్లల్లో మంద బుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆరోజున ప్రపంచ ఆటిజం అవగాహనా దినం  నిర్వహిస్తున్నారు. 2007వ సంవత్సరం డిసెంబర్‌ 18వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు 2008వ సంవత్సరం నుంచి ఏటా ఏప్రిల్‌ 2 తేదీన ఈ కార్యక్రమం  జరుగుతోంది.

ప్రపంచ ఆటిజం అవగాహన దినం 2023: థీమ్‌

ఈ సంవత్సరం ప్రపంచ ఆటిజం అవగాహన దినాన్ని ‘కథనాన్ని మారుద్దాం: ఇంట్లో, పనిలో, కళలలో  విధాన రూపకల్పనలో  సహకారాలు అందిద్దాం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సమాజంలోని అన్ని రంగాల్లో ఆటిజం ఉన్న వ్యక్తులను అంగీకరించేలా అవగాహన కల్పించేందుకు అనేక  కార్యక్రమాలు చేపడతారు.

ఆటిజం అంటే…

ఆటిజం అనేది బాల్యంలోనే ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి జీవితకాలం నాడీ సంబంధిత రుగ్మతగా డాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఆటిజం ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. జాతి, సామాజిక, ఆర్థిక బేధాలతో పాటు లింగ బేధాలు కూడా లేని  రుగ్మత. ఆటిజం యొక్క అనేకమైన లక్షణాలను వివరించడానికి ఆటిజం స్పెక్ట్రమ్‌ అనే పదం  ఉపయోగిస్తారు. అయితే, ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులు జీవితాంతం అదే రుగ్మతతో ఉంటారని నిర్థారించలేము. వారి మానసిక ఎదుగుదల,వ్యక్తిగత  నైపుణ్యాలు, ఏ వయసులోనైనా వికసించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదిక ప్రకారం, ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో ఇతరుల మాదిరిగానే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.అయితే, మరికొంతమంది మాత్రం తీవ్రమైన  ఇబ్బందులతో బాధపడుతునన్నారు.

ఆటిజం ఎలా తగ్గించాలి?

తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల  వారి పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరోవైపు, గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, ముఖ్యంగా భారీ లోహాలు, పర్టిక్యులేట్‌  పదార్థాల ప్రభావానికి గురికావడం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.గర్భిణి లు ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు హాజరుకావాలి. కడుపులోని బిడ్డ ఎదుగుదల క్రమాన్ని ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యమైంది. పిల్లలకి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయితే, ముందస్తు చర్యల ద్వారా వారి  కమ్యూనికేషన్‌, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అవకాశముంది.

తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తల్లులు తమ శిశువులలో ఆటిజంను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భస్థ శిశువులో ఉన్న  సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రినేటల్‌ చెక్‌-అప్‌లకు హాజరుకావడం తప్పనిసరని  స్పష్టంచేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో  పాటు, ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామాలు చేయడం, హానికరమైన ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ధూమపానం, ఆల్కహాల్‌, డ్రగ్స్‌ వంటి పదార్థాలకు గర్భిణీలు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలు తీసుకోవాలని, కడుపులో శిశువు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముందస్తు చర్యల్లో భాగమని వైద్య నిపుణులు  వెల్లడిస్తున్నారు.

శిశువు కదలికలకు సంబంధించి ఏవైనా అనుమానించే లక్షణాలు గుర్తిస్తే, వెంటనే, డాక్టర్లను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా, తల్లులు తమ బిడ్డకు ఆటిజం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News