Sunday, November 16, 2025
HomeNewsBigg Boss New Promo: గౌరవ్ ఏంట్రా మరీ ఇలా ఉన్నావురా.. పికిల్స్ పాప మెనూ...

Bigg Boss New Promo: గౌరవ్ ఏంట్రా మరీ ఇలా ఉన్నావురా.. పికిల్స్ పాప మెనూ కు బిగ్ బాస్ షాకే..!

Bigg Boss New Promo: బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్స్ వెళ్లిన తర్వాత అన్నీ గొడవలే కన్పించాయి. ఇప్పటివరకు సరైన ఎంటర్ టైన్ మెంట్ కన్పించలేదు. కానీ, ఇప్పుడు రీసెంట్ ప్రోమోలో మాత్రం ఫుల్ చిల్లింగ్ మూమెంట్స్ కన్పించాయి. ముఖ్యంగా ఇమ్మానుయేల్.. వైల్డ్‌కార్డ్స్‌తో కలిసి కామెడీ ఇరగదీశాడు. మరోవైపు రమ్య మోక్ష తనకి ఇచ్చిన ఫుడ్ పవర్‌ని ఈరోజు ఎపిసోడ్‌లో ఉపయోగించింది. అయితే ఇందుకోసం ఆమె చెప్పిన ఫుడ్ ఆర్డర్ లిస్ట్ విని బిగ్‌బాస్ కళ్లు తేలేసి ఉంటాడు. ఎందుకంటే ఆమె చెప్పిన లిస్ట్ పెళ్లి భోజనం అంత ఉంది. ఇక, దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

- Advertisement -

Read Also: Bigg Boss Nominations:  కెప్టెన్ కి స్పెషల్ పవర్.. రాత్రిపూట రాజు, రాజా గుసగుసలు

రీతూ- సుమన్ శెట్టి..

ప్రోమోలో రీతూ చౌదరి-సుమన్ శెట్టి ఓ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే దూరంగా ఉన్న ఇమ్మానుయేల్ వాళ్ల సంభాషణకి లిప్ సింక్ ఇచ్చి నవ్వులు పూయించాడు. ఇమ్మూ చెప్పిన డైలాగులకి భరణి, దివ్య-తనూజ తెగ నవ్వుకున్నారు. మరోవైపు కొత్త కుర్రాడు గౌరవ్‌కి తెలుగు నేర్పించేందుకు ఇమ్మూ సహా అందరూ నానా కష్టాలు పడుతున్నారు. అందరికీ నమస్కారం.. నేను.. అని గౌరవ్ అనగానే ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు.. అంటూ ఇమ్మూ అడిగాడు. ముంబై నుంచి.. అని గౌరవ్ అనగానే నాకు కాదురా సామీ ఆడియన్స్‌కి చెప్పు అంటూ పంచ్ వేశాడు. తర్వాత నేను కళాకారుడ్ని.. తెలుగు ప్రేక్షకులంటే.. అని ఇమ్మూ చెప్పగానే చాలా డిఫికల్ట్ వర్డ్ ఉంది బ్రో.. అంటూ గౌరవ్ కంగారుపడ్డాడు. కష్టమైనవే నేర్చుకోవాలన్నా.. అంటూ ఇమ్మూ చెప్పాడు. అయేషా అయితే తెలుగు నేర్చుకోవాలంటే ఏంటి మరి ఉన్నావా, తిన్నావా, కొన్నావా అని నేర్పుస్తున్నాం అనుకున్నావా.. చాలా సీరియస్‌ టాస్క్ ఇది.. అంటూ అరిచింది. దీంతో మిమ్మల్ని గొడవపడమనలేదు.. నామినేషన్‌లో అరుచుకున్నట్లు అరుస్తున్నారు.. అని ఇమ్మూ కామెడీ చేశాడు. తర్వాత ఉప్పు కప్పురంబు.. అని ఇమ్మూ పద్యం చెప్తుంటే ఏంట్రా బ్రో.. ఏంట్రా బ్రో.. అంటూ గౌరవ్ అవాక్కయ్యాడు. కాసేపటికి అందరూ లివింగ్ ఏరియాలో ఉండగా ఏదో నోటీస్ వస్తే స్టోర్ రూమ్ దగ్గరికి గౌరవ్ వెళ్లబోయాడు. నువ్వు వెళ్లి నోటీస్ తెచ్చి చదువుదామనేనా.. అంటూ ఇమ్మూ మళ్లీ కామెడీ చేశాడు. వచ్చిన నోటీస్‌ని కళ్యాణ్ చదివి వినిపించాడు.

Read Also: Bigg Boss Divvala: దువ్వాడ నువ్వు దేవుడివయ్యా.. ఆమెను ఎలా భరిస్తున్నావురా సామి..!

రమ్య మోక్షకు స్పెషల్ పవర్..

వైల్డ్‌కార్డులు హౌస్‌లో అడుగుపెట్టేముందు ఒక్కొక్కరికి ఒక్కో పవర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అలా పచ్చళ్లమ్ముకునే రమ్య మోక్షకు బంపరాఫర్‌ ఇచ్చాడు. తనకు ఎప్పుడంటే అప్పుడు.. ఏది కావాలంటే అది.. నచ్చిన వంటకాలను అడిగితే బిగ్‌బాస్‌ కాదనుకుండా పంపిస్తాడని నాగార్జున చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్‌ రమ్య వదులుకుంటుందా? సమస్యే లేదు. పెద్ద లిస్ట్‌ ఇచ్చిన రమ్యటిఫిన్‌లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరీ, మైసూర్‌ బజ్జీ.. లంచ్‌కి చికెన్‌ జాయింట్స్‌, ఎగ్‌ బిర్యానీ, వెజ్‌ టిక్కా పిజ్జా, బనానా చిప్స్‌, నాలుగు ఎగ్‌ ట్రేలు కావాలంటూ సరుకుల లిస్ట్‌ చదువుతూనే ఉంది. ఈ లిస్ట్‌ విని బిగ్‌బాస్‌ గుడ్లు తేలేయడం కాయం. ఈ ఫుడ్‌ను సుమన్‌తో షేర్‌ చేసుకుంటానంది. అక్కడితో ఆగలేదు. 5 కిలోల చికెన్‌ కూడా అడిగేసింది. పనిలో పనిగా చికెన్‌ పచ్చడి పెడుతుందేమో! తినలేక తంటాలుదొరికిందే ఛాన్స్‌ అని ఆర్డర్‌ పెట్టింది కానీ ఆ వంటకాలన్నీ తినలేక నానా అవస్థ పడినట్లు తెలుస్తోంది. ఏకంగా వాంతులు కూడా చేసుకుందంటున్నారు. మరి ఆర్డర్‌ చేసిన వంటకాలను మిగతా హౌస్‌మేట్స్‌కు పంచారా? లేదంటే రమ్య కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని బిగ్‌బాస్‌ ఏమైనా ఆర్డర్లు వేశారా చూడాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad