Budget Bikes with high mileage: దేశంలో మోటార్‌సైకిళ్ల వినియోగం బాగా పెరిగింది. ప్రతి ఇంట్లో ఒక బైక్ అనే కాన్సెప్ట్ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్ ధరలో మనకు మంచి మైలేజీ ఇచ్చే బైక్స్ అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్, బజాజ్, హోండా, హీరో నుంచి ఈ బైక్స్ కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.59,000 ప్రారంభ ధర మీరు బైక్‌ని ఇంటికి తెచ్చుకోవచ్చు. మార్కెట్‌లో మంచి, మైలేజీ అందరికీ సూట్ అయ్యే బైక్స్, వాటి ధర ఫీచర్లు వివరాలు మీకోసం..
హోండా ఎస్పీ 125: హోండా షైన్ వద్దు అనుకునేవారు ఈ బైక్‌ని కొనుగోలు చేయవచ్చు. అతి తక్కువ ధరలో ఈ 125సీసీ బైక్ లభిస్తుంది. దీని ధర రూ. 92,000 నుంచిరూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. ఇందులో మీరు డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైలెంట్ స్టార్టర్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
హీరో స్ప్లెండర్ ప్లస్: ఇది పరిచయం అక్కర్లేని బైక్. దీనికి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 77,000 నుంచి రూ. 79,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులోనూ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బైక్ టాక్సీ రైడర్ల కోసం USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్ కలదు.
టీవీఎస్ రేడియన్: ఈ బైక్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీనికి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ సైతం ఉంది. ఎందుకంటే ఈ బైక్ ధర కేవలం రూ. 59,000 మాత్రమే. ఈ బైక్ టాప్ మోడల్ ధర రూ. 83,000 మాత్రమే. ఈ రెండు (ఎక్స్-షోరూమ్) ధరలు. ఇక ఈ బైక్ 109.7 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల భారీ మైలేజీని అందిస్తుంది. ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
బజాజ్ ప్లాటినా 110: దీనికి పేదోడి బండి అనే పేరు ఉంది. ఎందుకంటే దీని ధర మైలేజీ, ఫర్ఫామెన్స్ ఇలా అన్నింట్లో తోప్ అని చెప్పవచ్చు. అందుకే జనాలు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ బజాజ్ ప్లాటినా 110 బైక్ ధర రూ. 71,000 నుంచి రూ. 74,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 115 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రయాణిస్తుంది. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా కలవు.
టీవీఎస్ స్పోర్ట్: ఈ బైక్ కూడా రోజువారీ అవసరాలు, ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ ప్రారంభ ధరలు రూ. 69,000 నుంచి రూ. 72,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 109 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని. ఇందులో సేఫ్టీ కోసం ఫ్రంట్, రియర్ డ్రమ్ బ్రేక్స్ కలవు.