ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మేల్యే కే.పీ.వివేకానంద…సీఎం కేసీఆర్ సమక్షంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను గజమాలతో సత్కరించారు.
బహదూర్ పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాసాని జ్ఞానేశ్వర్ సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీలో ఇటీవల చేరిన సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హాజరవగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద,ఇతర ప్రజా ప్రతినిధులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం బిఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరిందన్నారు. వారి రాజకీయ అనుభవంతో రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి – సంక్షేమంలో అగ్రపథాన నిలుపుతామన్నారు. సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి చేరికతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీలో నూతనంగా చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం నేడు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు.రాష్ట్రంలోనే అన్ని కులాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యారన్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ లో అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు, విద్యావంతుడు,యువకుడు కేపీ. వివేకానంద ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, భారీ మెజార్టీ సాధించే వైపుగా నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. అంతకముందు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి సన్మాన కార్యక్రమానికి చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాదాపు 200 మంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, యువజన నాయకులు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముదిరాజ్ కులబాందవులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.