Monday, April 22, 2024
Homeతెలంగాణ10 రోజులు కష్టపడండి, అయిదేండ్లు మీ కష్టసుఖాల్లో తోడుంటా

10 రోజులు కష్టపడండి, అయిదేండ్లు మీ కష్టసుఖాల్లో తోడుంటా

కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిని మమిడాల యశస్విని రెడ్డి

దగాకూర్ దయాకర్ ను నమ్మితే పాలకుర్తి ప్రజలకు అధోగతి తప్పదని కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మమిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని కోరి పల్లి, కాన్వాయ్ గూడెం, గంట్ల కుంట్ల , మోతాయే తండా గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్- గడప గడపకు జాన్సమ్మ పేరిట కాంగ్రెస్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దయలేని దయాకర్ రావు మాటలు మరోసారి నమ్మి మోసపోతే గోసపడక తప్పదని, దయాకర్ రావు జిమ్మిక్కులు, తాయిలాలకు ఆశపడితే మరో ఐదేళ్లు గోసపడక తప్పదని ఆమె అన్నారు. నియోజకవర్గంలో సరైన విద్యా వసతులు వైద్య వసతులు కరువయ్యాయని, గడిచిన 15 ఏళ్లలో దయాకర్ రావు చేసింది శూన్యమని, 30 సంవత్సరాల క్రితం నుండి తాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, గిరిజన తండాల దుస్థితి చూస్తుంటే బాధ కలుగుతుందని ఆమె అన్నారు. దోచుకోవడానికి దాచుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని, ఆడపడుచుగా ఆదరించి ఒక్క అవకాశం ఇస్తే మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఐదేళ్లు సేవ చేస్తానని ఆమె అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం, ప్రతి ఇంటా సంక్షేమం చేకూరుతుందని, పేదల సంక్షేమం కోసమే విద్యార్థుల చదువుకు రూ. 5 లక్షలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, పంట ఉత్పత్తులకు రూ. 500 బోనస్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పింఛన్ రూ. 4 వేలకు పెంపు వంటి ప్రజా రంజక ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసేందుకై రూపొందించామన్నారు.

ప్రజలు తమ భవిష్యత్తును ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని,ఆడపడుచుగా ఆదరించి గెలిపిస్తే ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తూ పాలకుర్తి నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతానని ఆమె చెప్పారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని దయాకర్ రావు బెదిరింపులకు అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన పనిలేదని, అండగా ఉంటూ అందరినీ కాపాడుకుంటానని కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.

మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తున్నాడని,ఆ పప్పులు పాలకుర్తిలో ఉడకమన్నారు. 10 రోజులు కష్టపడి పని చేయండి.. ఐదేళ్లు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News