నీట్ పరీక్ష పై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలోని బీఆర్ఎస్వీ నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం సాగింది. నీట్ పరీక్ష ను రద్దు కోరుతూ బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు. అనంతరం బి.ఆర్.ఎస్.వి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదు? అని బీఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తాయి. గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర నాయకులు తుంగ బాలు డిమాండ్ చేశారు.
వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలి..
దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ స్పందించక పోతే రాబోయే రోజులలో బి.ఆర్.ఎస్.వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నామన్న ఆయన, ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామన్నారు.