Citroen C3 Sport Edition: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల కంపెనీ తన్ సిట్రోయిన్ సీ3ని సరికొత్త స్పోర్ట్ ఎడిషన్‌ని విడుదల చేసింది. దీనిని కేవలం రూ. 6.44 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ కారును కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే కంపెనీ విక్రయించనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ రెగ్యూలర్ సీ3తో పోలిస్తే మంచి డిజైన్ పరంగా, ప్రాక్టికల్ యాక్సెసరీస్, ఎక్స్టీరియర్లో సరికొత్త కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది. స్పోర్ట్ ఎడిషన్‌కి తగ్గట్టే ఇది అథ్లెటిక్ ఫీల్, మంచి అడ్వెంచర్ కోరుకునే డ్రైవర్ల కోసం రూపొందించబడింది.
ఈ కొత్త సిట్రోయిన్ సీ3 స్పోర్ట్ ఎడిషన్ ధర స్టాండర్డ్ వేరియంట్ల కంటే రూ. 21,000 ఎక్కువగా ఉంది. ఇందులో డాష్ క్యామ్, వైర్లెస్ ఛార్జర్‌తో కూడిన టెక్ కిట్‌ని అదనంగా రూ .15,000 చెల్లించి పొందవచ్చు. పైన చెప్పిన విధంగా సీ3 స్పోర్ట్ ఎడిషన్ బాడీ మొత్తం ‘స్పోర్ట్’ లుక్‌తో ఉంటుంది. అంతే కాకుండా గార్నెట్ రెడ్ ఎక్ట్సీరియర్ పెయింట్‌తో సరికొత్తగా అందించారు. ఈ కలర్ ఆప్షన్లో లభిస్తున్న మొదటి సీ3 లైనప్ కావడం విశేషం.
ఇవే కాకుండా ఈ స్పోర్టీ కారుకి పెడల్స్, సీట్ బెల్ట్ కుషన్లు, కస్టమైజ్డ్ సీట్ కవర్లను కూడా జోడించింది. ఇక యాంబియంట్ క్యాబిన్ లైటింగ్ ఇంటీరియర్‌కి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. నైట్ రైడ్స్‌లో ఇది రైడర్లకు నచ్చుతుంది.
ఫీచర్లు: పైన చెప్పిన విధంగా యాంబియంట్ లైటింగ్, స్పోర్ట్ థీమ్ సీట్ కవర్లు మరియు ఫ్లోర్ మ్యాట్స్ కలవు. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం అందించబడింది.
స్పెసిఫికేషన్లు: ఈ స్పోర్ట్ ఎడిషన్ రెండు పెట్రోల్ ఇంజిన్లు.. వివిధ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ ప్యూర్ టెక్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 81 bhp మరియు 115 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.2-లీటర్ ప్యూర్‌టెక్ 110 టర్బోఛార్జ్డ్ ఇంజిన్ 108 bhp మరియు 205 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 18.3 కిలోమీటర్ల నుంచి 19.3 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇక స్పోర్ట్స్ కారు కాబట్టి అందుకు తగినట్లుగానే ఆటోమేటిక్ టర్బో వెర్షన్ కేవలం 10 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల భారీ వేగాన్ని అందుకుంటుంది.
Citroen C3 Sport Edition: సిట్రోయిన్ సీ3 స్పోర్ట్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES