ఢిల్లీ నూతన సీఎం(Delhi CM) ఎరవనే దానిపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నూతన సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీ సాయంత్ర 4.30 గంటలకు సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విధితమే. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయం జెండా ఎగిరింది. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించారు. ఆప్, కాంగ్రెస్ రెండూ విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓట్లు భారీగా చీలి బీజేపీకి ప్లస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.