Saturday, November 15, 2025
Homeహెల్త్Hair lost control tips: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ చిట్కాలు చాలా మంచివి!

Hair lost control tips: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ చిట్కాలు చాలా మంచివి!

జుట్టు రాలడం అనేది.. ఈ మధ్య తరచుగా వేధిస్తోన్న సమస్య. ముఖ్యంగా ఇది మగవారిలో. ముప్పై ఏళ్ళు కూడా రాకముందే చాలా మంది బట్టతల బారిన పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. జరగాల్సిన నష్టం జరిగిపోయేదాకా చూసేదానికన్న.. మొదట్లోనే జాగ్రత్త పడితే జుట్టు రాలడాన్ని కాస్త నైనా అరికట్టవచ్చు.

అది కూడా చిన్ని చిన్ని ఇంటి చిట్కాలతోనే. ఇవన్నీ సహజమైన పదార్థాలతో ఇంట్లోనే చేయవచ్చు. ఇవి జుట్టు రాలుదల తగ్గించడంలో, కొత్త జుట్టు మొలకెత్తించడంలో, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఎంతో సహాయపడతాయి.

- Advertisement -
  1. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె తల తేమగా ఉండేలా చేసి కుదుళ్లను బలపరుస్తుంది.

వాడే విధానం:

ముందుగా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని వేడి చేసి.. గోరువెచ్చగా మారిన తర్వాత చేతుల్లోకి తీసుకోండి. తలకు నెమ్మదిగా మసాజ్ చేయండి. కనీసం ఒక గంట తర్వాత తక్కువ కెమికల్స్ ఉండే షాంపూతో స్నానం చేయండి.

  1. ఉల్లిపాయ రసం:
    రక్త ప్రసరణ పెంచి కొత్త జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.

వాడే విధానం:

ఒక ఉల్లిపాయను మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని తలకు పూయాలి. 20–30 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడగాలి. వారం లో 2–3 సార్లు చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.

  1. కలబంద: తలపై చర్మాన్ని మృదువుగా చేసి.. జుట్టు రాలకుండా చేస్తుంది.

వాడే విధానం:

తాజా కలబంద గుజ్జును తీసుకుని తలకు బాగా రుద్దాలి. 30–45 నిమిషాల పాటు ఉంచి నీటితో కడగాలి. వారంలో 2–3 సార్లు వాడవచ్చు.

  1. మెంతి గింజలు: మెంతులు జుట్టుకు బలాన్ని ఇస్తాయి, వాటిని రాలిపోకుండా చేస్తాయి.

వాడే విధానం: 2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలు రాత్రి నానబెట్టాలి. వాటిని మెత్తగా నూరి పేస్ట్ లా చేసి తలకు రాయాలి. ఓ 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడగేయాలి.

  1. వేపాకులు:

వేపాకు తలపై దద్దుర్లు, చుండ్రును తగ్గించి, ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

వాడే విధానం:

కొద్దిగా వేపాకులను తీసుకుని వాటిని నీటిలో ఉడికించి.. ఆ రసాన్ని తలపై అప్లై చేయాలి. ఇలా వారం‌లో 2 సార్లు చేస్తే మంచిది.

  1. గ్రీన్ టీ:
    గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలే సమస్యను చాలా వరకు తగ్గిస్తాయి.

వాడే విధానం: ఒక గ్లాస్ నీటిలో 1–2 గ్రీన్ టీ బ్యాగ్స్ వేసి ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత తల కడిగిన తర్వాత చివర్లో ఈ నీటిని తలపై అప్లై చేయాలి. అప్పుడప్పుడు ఇలా చేస్తే మీ జుట్టు స్ట్రాంగ్ అవ్వడంతో పాటు కొత్త జుట్టు మొలవడంలోనూ సాయపడుతుంది.

ఇవన్ని సహజమైన చిట్కాలు కావడంతో.. వీటిని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ కాస్త టైం తీసుకుని క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య ఇంతకుమించి ఇంకా తీవ్రంగా ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యులు సరైన కారణాన్ని నిర్ధారించి, తగిన చికిత్సను మీకు సూచిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad