Thursday, September 19, 2024
HomeNewsHeadbath tips: తలస్నానం ఇలా చేయద్దు

Headbath tips: తలస్నానం ఇలా చేయద్దు

తనస్నానంతో మీ చర్మం, జుట్టు డ్యామేజ్ కాకుండా కేర్ తీసుకోవాలి

తలస్నానం చేసేటప్పుడు ఈ పొరబాట్లు చేయొద్దు…
తలస్నానం చేసేటప్పుడు మనం అలవోకగా చేసే కొన్ని పనులు జుట్టు దెబ్బతినడానికి కారణం అవుతుంటాయి. ఇలాంటి పొరబాట్ల వల్ల జుట్టు బాగా పెరగకపోవడం కూడా సంభవిస్తుంటుంది. అలాంటి పొరబాట్ల గురించి చూద్దాం. వెంట్రుకలు అందంగా ఉండడానికి, శుభ్రంగా కనిపించడానికి తరచూ తలస్నానం చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల అవసరమైన మాయిశ్చరైజర్ ను వెంట్రుకలు కోల్పోతాయి. దీంతో వెంట్రుకలు తాజాదనంతో మెరవవు. అలాగే జుట్టు చిక్కుబడకుండా ఉండాలంటే షవర్ ఫ్రెండ్లీ బ్రష్ వాడితే మంచిది. దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లడం తగ్గుతుంది. జుట్టు సమస్యలకు తగ్గట్టు స్పెషలైజ్డ్ ఉత్పత్తులను చాలామంది వాడరు. ఇది మరొక పొరబాటు. అలాగే తలస్నానం చేసేటప్పుడు బాగా వేడిగా ఉండే నీళ్లను వాడుతుంటారు.

- Advertisement -


ఇది కూడా మంచిది కాదు. ఇలా చేసినపుడు హైడ్రేటింగ్ మాస్కుతో మాయిశ్చరైజర్ ని చేసి వెంట్రుకలను సంరక్షించుకోవాలి. లేకపోతే జుట్టు దెబ్బతింటుంది. జుట్టు ఆరోగ్యంగా, ద్రుఢంగా ఉండడానికి శక్తివంతమైన హైడ్రేటింగ్ మాస్కును తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. మాడు రుద్దుకునేటప్పుడు మసాజ్ బ్రష్ ని ఉపయోగిస్తే మాడు ఎంతో శుభ్రంగా ఉంటుంది. దీన్నిషాంపు స్కాల్ప్ మసాజ్ బ్రష్ అంటారు.
దీంతో మాడులో హెయిర్ స్ప్రే, జల్ వంటి వాటికి సంబంధించిన మిగుళ్లు లేకుండా పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు రాదు. చిక్కటి పళ్లు ఉన్న బ్రష్ తో
మాడును సున్నితంగా మసాజ్ చేసుకోవడం వల్ల మాడు మరింత శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు స్కాల్ప్ మసాజ్ వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. అందుకే స్కాల్ప్ మసాజ్ బ్రష్ ఉపయోగించడం మంచిది. జుట్టు ఒత్తుగా, అందంగా కనపడాలని చాలామంది రకరకాల ప్రాడక్టులను వెంట్రుకలపై అప్లై చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మంచి కన్నా దుష్ఫలితాలే ఎక్కువగా ఎదురవుతాయి. వెంట్రుకలు దెబ్బతింటాయి. కుదుళ్లు జిడ్డుగా తయారవుతాయి. వెంట్రుకలు మ్యానేజ్ చేసేలా ఉండవు. అందుకే లైట్ వెయిట్ డీప్ కండిషనింగ్ క్రిమును జుట్టు మధ్యలోంచి అంచుల వరకూ అప్లై చేయాలి. జుట్టు చిక్కును కూడా ఈ క్రీము పోగొడుతుంది. స్నానం చేసేటప్పుడు బ్రష్ ను వాడుతుంటాం. తడి జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి దానిపై బ్రష్ ఉపయోగిస్తే దెబ్బతింటుంది. అందుకే తడిజుట్టుకోసం డిజైన్ చేసిన వెట్ ఫ్రెండ్లీ బ్రష్ ను మాత్రమే వాడాలి. ముందుగా తడిజుట్టును టవల్ తో బాగా తుడుచుకున్న తర్వాత వెట్ ఫ్రెండ్లీ బ్రష్ తో దువ్వుకుంటే వెంట్రుకలు చిక్కు పడవు. ఊడవు. ఎంతో సురక్షితంగా కూడా ఉంటాయి. అదీ సంగతి. మరి ఈ విషయాలు మర్చిపోకుండా మీ వెంట్రుకలను సురక్షితంగా ఉంచుకోండి..ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News