Monday, November 17, 2025
HomeNewsHyderabad: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం.. పలు చోట్ల వర్షం

Hyderabad: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం.. పలు చోట్ల వర్షం

హైదరాబాద్‎లో(Hyderabad) ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతకు గురైన ప్రజలు.. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్, లక్డీకపూల్‎తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Rian)కురిసింది.

దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీరు నిల్వ ఉండే చోట్ల సహయక చర్యలు చేపట్టారు. సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చంచింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad