తలనొప్పి.. కొంతమందికి తరచూ వేధించే సమస్య. హెడేక్ బాధలో త్వర ఉపశమనం కోసం టాబ్లెట్ లు వాడుతుంటారు. అయితే టాబ్లెట్ వాడకం లేకుండానే ఆహారపు అలవాట్లలో కొద్ది కొద్ది మార్పుల ద్వారా కూడా తలనొప్పిని అరికట్టవచ్చు. హెడేక్ నివారణకు ఉన్న సహజ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. నీరు సరైన మోతాదులో సేవించడం:నీటి కొరత వల్ల తలనొప్పి వస్తుంది. రోజూ కనీసం 3–4 లీటర్ల నీరు తాగండి.
2. తులసి లేదా అల్లం టీ:తులసి ఆకులు లేదా అల్లం ముక్కలతో చేసిన టీ తలనొప్పిని తగ్గిస్తుంది.
3. నువ్వుల నూనె మర్దన:తలపై నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమి వల్ల వచ్చే తలనొప్పికి ఇది చాలా ఉపయోగకరం.
4. పుదీనా ఆకుల రసం:పుదీనా ఆకుల రసాన్ని కప్పులో వేసుకుని అరచేతితో తలకు రుద్ది నెమ్మదిగా మసాజ్ చేస్తే తల అంతా చల్లబడుతుంది.
5. ప్రాణాయామం:మానసిక ఒత్తిడి, తల నొప్పి తగ్గించేందుకు ప్రాణాయామం చేయండి.
6. మంచి నిద్ర:రోజుకు కనీసం 7–8 గంటలు నిద్ర పోవడం తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
7. కాఫీ తక్కువగా తీసుకోండి: కాఫీ లేదా టీ ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి రావచ్చు. కాబట్టి మితంగా తీసుకోవాలి.తరచూ తలనొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించండి.
ఇక చివరగా సైనసైటిస్, మైగ్రైన్, బీపీ వంటివి తలనొప్పికి కారణం కావొచ్చు.
Headache Remedies: టాబ్లెట్ అక్కర్లేదు.. చిటికెలో తలనొప్పి మాయం..!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES