Saturday, November 15, 2025
HomeNewsHigh court: కేసీఆర్‌, హరీశ్‌ రావు పిటిషన్లపై విచారణ వాయిదా

High court: కేసీఆర్‌, హరీశ్‌ రావు పిటిషన్లపై విచారణ వాయిదా

KCR & Harish Rao Petitions: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీవీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి (కేసీఆర్), మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం నుంచి మూడు వారాల లోపు కౌంటర్‌ సమర్పించాలని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది. దీంతో 5 వారాల తర్వాత ఈ పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ కొనసాగనుంది.

- Advertisement -

ఇదే సమయంలో ఈ కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ముందుకు సాగుతామని సీజే చెప్పారు. కమిషన్‌ నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే వెబ్‌సైట్‌ నుంచి సదరు ప్రతులను తొలగించాలని ఆదేశించింది.

కేసీఆర్, హరీశ్‌ రావు పిటిషన్లు ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులు, ప్రభుత్వ ఆరోపణలు, అలాగే అధికార యంత్రాంగం వైఖరిపై కోర్టు జోక్యం కోరుతూ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్లలో నివేదికకు సంబంధించిన పత్రాలను సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

ఆరోపణలు: ప్రభుత్వానికి అనుకూలంగా కమిషన్ నివేదిక సమర్పించినట్లు భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొదటి నుంచి ఆరోపిస్తుంది. తెలంగాణకు జలధారలు పారించేందుకు కేసీఆర్‌ ముందుంది కాళేశ్వరం నిర్మిస్తే రాష్ట్ర ప్రయోజనాలు పక్కనబెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని అన్నారు. అందుకే ఈ న్యాయపోరాటం చేస్తున్నట్లు నాయకులు చెప్తున్నారు. చివరకు నిజమే గెలుస్తుందని ఈ అసత్యపు నివేదికలు చెల్లుబాటు కావని అన్నారు.

తప్పు తప్పే: కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం నిజాన్ని బయటపెడుతుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకు భయపడుతున్నారని అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తోంది. చివరకు కోర్టుల మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందని కేసీఆర్‌కి వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad