Sunday, October 6, 2024
HomeNewsమరో యంగ్ హీరో పెళ్లికి సిద్దమయ్యాడా..?

మరో యంగ్ హీరో పెళ్లికి సిద్దమయ్యాడా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యాచ్‌ల‌ర్‌ హీరోలంతా పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే రానా , నితిన్ , నిఖిల్ మొదలగు యంగ్ హీరోస్ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వగా..రీసెంట్ గా శర్వానంద్ సైతం పెళ్లి చేసుకున్నాడు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి చేసుకొని బ్యాచ్‌ల‌ర్‌ లైఫ్ కు బై బై చెప్పబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

- Advertisement -

2006 లో దేవదాస్ మూవీ తో ఇండస్ట్రీ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దేవదాస్ , రెడీ , కందిరీగ , పండగ చేస్కో , నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ , హలో గురు ప్రేమకోసమే , ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్..ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలనుకుంటున్నాడట. ఇప్పటికే రామ్ బాబాయ్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ..రామ్ కోసం ఓ చక్కటి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాడని అంటున్నారు. రీసెంట్‌గానే హైద‌రాబాద్‌లోని బిజినెస్ మ్యాన్ కుమార్తెతో రామ్ పెళ్లి సంబంధం మాట్లాడ‌రంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు బ్యాచ్‌ల‌ర్‌గా కొన‌సాగుతూ వ‌చ్చిన రామ్ అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాదిలోనే రామ్ పెళ్లి జ‌రుగుతుంద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌. మరి నిజంగా రామ్..ఈ పెళ్ళికి ఓకే చెపుతాడో..? లేక మరో అమ్మాయిని చూస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News