Wednesday, October 2, 2024
HomeNewsKarimnagar: బ్లాక్ మార్కెట్ కు రాయితీ ఉల్లిగడ్డ, స్పందించని అధికారులు

Karimnagar: బ్లాక్ మార్కెట్ కు రాయితీ ఉల్లిగడ్డ, స్పందించని అధికారులు

ఉల్లిఘాటు..

అడ్డగోలుగా పెరిగిన ఉల్లి ఘాటు నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం రైయితీపై విక్రాయించాలని నిర్ణయించి ఉల్లి గడ్డను జిల్లాలకు పంపిస్తే అధికాస్తా దళారుల చేతుల్లో పడి నల్లభజారుకు తరలి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

కిలోకు 35 రూపాయల చొప్పున విక్రయించేందుకు గత రెండు రోజుల క్రితం మూడు లారీలలో కరీంనగర్ జిల్లాకు చేరిన ఉల్లి గడ్డ నల్లభజారుకు తరలింది. ఈ విషయం అధికారుల ద్రుష్టికి వెళ్లి నప్పటికీ స్పందించక పొగ, చోద్యం చూస్తున్నట్లు వ్యవహారించారనే విమర్శలు వస్తున్నాయి. పలువురు అనుమానాలను కూడా వ్యక్తం చేసారు. జిల్లాకు చేరిన సరుకును భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా విక్రాయించాల్సి వుంది. సమాఖ్య ప్రతినిధులు గుత్తే దారులకు అప్పగించి సంచార వాహనాలలో విక్రాయించాలి నగర ప్రజల సమాచారం మేరకు ఉల్లిగడ్డ నల్లభజారుకు చేరింది. గతంలో ఇలాంటి పనులలో నైపుణ్యం ఉన్నావారే ఈ ఉల్లిగడ్డను దర్జాగా నల్లభజారుకు తరలించినట్లు సమాచారం. పేద ప్రజల కోసం ప్రభుత్వం రేయితీపై పంపే సరకుల విషయంలో నిఘా పెట్టవలసిన అధికారులు అవినీతిలో కురుకుపోయి దాళారి వ్యవస్థకు అండగా నిలబడుతున్నారనే ప్రచారం మెండుగా సాగుతుంది. ఇప్పటికైనా అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టి ప్రజా మెప్పు పొందాలని పలువురు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News