Montra Super Cargo Electric Auto: మోంట్రా ఎలక్ట్రిక్ ఇటీవలె సరికొత్త త్రీ వీలర్‌ని మార్కెట్లో విడుదల చేసింది. ఈవీ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న క్రేజ్ కారణంగా త్రీవీలర్ కంపెనీలు సైతం అంతే మొత్తంలో వీటి ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. తాజాగా మోంట్రా ‘సూపర్ కార్గో’ పేరుతో ఆటోను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.4.37 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించిది. ఈ ధర కూడా సబ్సిడీ తర్వాత అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో భారీ సామార్థ్యంతో లోడ్‌ని మోయగలదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఇందుకోసం ఈ ఆటోలో 13.8 కిలోవాట్ల లిథియం-ఐయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 200 కిమీ రేంజ్‌ని అందిస్తుంది. అయితే 170 కి.మీ రియల్‌టైమ్ మైలేజీని అందించే అవకాశం ఉంది. 11kW పీక్ పవర్, 70NM టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆటో 1.2 టన్నుల వరకు బరువుని మోయగలదు. బరువు ఇతర సౌలభ్యాన్ని బట్టి ఈ ఆటో మూడు కాన్ఫిగరేషన్లలో (170 క్యూబిక్ అడుగులు, 140 క్యూబిక్ అడుగులు, ట్రే డెక్) లభిస్తుంది. ఇక ఈ ఆటోలోని బ్యాటరీకి కంపెనీ 5 సంవత్సరాలు లేదా 1.75 లక్షల కిలోమీటర్లకు కచ్చితమైన వారంటీని ఇస్తోంది. ఈ ఆటోను కేవలం 15 నిమిషాల్లో 100 శాతం క్విక్ ఛార్జింగ్ చేయవచ్చు.
ఈ ఆటో రెడ్, స్టీల్ గ్రే, ఇండియన్ బ్లూ, స్టాలియన్ బ్రౌన్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 90కి పైగా ప్రముఖ నగరాల్లో షోరూమ్‌లు కలవు. ఈ ఆటోను కేవలం రూ. 10000 డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకువెళ్లవచ్చు.
దీనిలోని ఫీచర్ల విషయానికి వస్తే రీజనరేటీవ్ బ్రేకింగ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ అసిస్టెంట్, హై పెర్ఫార్మెన్స్ డిస్క్ బ్రేక్స్, సీట్ బెల్ట్ వంటివి కలవు. ఇవే కాకుండా ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఛార్జింగ్ పోర్ట్ వంటి ఇతర ఎన్నో ఫీచర్లు ఈ ఆటోలో కలవు. ఈ ఆటోలో బోరాన్ స్టీల్ ఛాసిస్ కలదు ఇది ఆటోను దీర్ఘకాలికగా స్ట్రాంగ్‌గా ఉండేందుకు అనుకూలంగా ఉంచుతుంది.
మొత్తంమీద ఈ ఆటో ట్రాలీ నడిపే వారికి, ఇతర కమర్షియల్ అవసరాల కోసం చూసే ఆపరేటర్లు అలాగే సొంతంగా మంచి ట్రక్ ఆటో కొనాలనుకునేవారికి సరిపోతుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ ఆటోను జనాలు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆటో మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది.


