Saturday, July 27, 2024
HomeNewsNanpur: వయోపరిమితి పెంపుపై గనులపై సంబరాలు

Nanpur: వయోపరిమితి పెంపుపై గనులపై సంబరాలు

INTUCదే క్రెడిట్

సింగరేణి కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వయోపరిమితి పెంపు సర్కులర్ విడుదల కావడంతో కార్మికులు గనులపై సంబరాలు జరుపుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గని వద్ద ఐ ఎన్ టి సి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు మాట్లాడుతూ …ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నప్పటికీ ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. జెనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికులకు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు వయోపరిమితి పెంపు సాధించడం జరిగిందని తెలిపారు. కార్మిక పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ కోసం వయోపరిమితి పెంపుపై సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు దారి చేయడం జరిగిందన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. అదేవిధంగా ఆర్ కె 6 గని లో కార్మికులకు రెస్ట్ హాల్, క్యాంటీన్ లాకర్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి రెస్ట్ హాళ్లను మరమ్మత్తులు చేయాలని గని మేనేజర్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి కేంద్ర కార్యదర్శి కలవేణి శ్యామ్, డిప్యూటీ కార్యదర్శి గరిగే స్వామి, ఏరియా కార్యదర్శులు కుమారస్వామి, నాయకులు జీవన్ రెడ్డి, మహేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News