Monday, June 16, 2025
Homeచిత్ర ప్రభNew OTT Releases: ఓటీటీలో కొత్త ఈ సిరీస్‌లు అస్సలు మిస్‌ అవ్వకండి!

New OTT Releases: ఓటీటీలో కొత్త ఈ సిరీస్‌లు అస్సలు మిస్‌ అవ్వకండి!

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మళయాళం సినిమాలతో ఈ వారం సినీ ప్రియులకు పండుగ వాతావరణమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం దాదాపు 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. అయితే వీటిలో వివిధ జోనర్లలోని కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం..

- Advertisement -

ఈ వారం సందడి చేస్తున్న తెలుగు కంటెంట్‌:

రానా నాయుడు సీజన్ 2 (Rana Naidu Season 2)

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

విడుదల తేదీ: జూన్ 13, 2025
జోనర్: యాక్షన్, క్రైమ్ డ్రామా

విశేషాలు: మొదటి సీజన్ ఓటీటీలో మిక్స్‌డ్‌ టాక్‌ సాధించిది. దీంతో రెండో సీజన్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే గత సిరీస్‌లా కాకుండా ఈసారి అసభ్య పదజాలాన్ని కాస్త తగ్గించి ముఖ్యంగా యాక్షన్, వయలెన్స్‌కు డైరెక్టర్‌ పెద్దపీట వేశారు. 

శుభం (Subham)

ప్లాట్‌ఫామ్: జియో సినిమా/హాట్‌స్టార్
విడుదల తేదీ: జూన్ 13, 2025
జోనర్: హారర్ కామెడీ
విశేషాలు: సమంతా నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ముగ్గురు యువకులు వారి భార్యలు దుష్ట ఆత్మలుగా మారినప్పపుడు ఎదుర్కొనే పరిస్థితులు హాస్యభరితంగా చిత్రీకరించారు. ఈ చిత్రం సైతం ప్రేక్షకులను అలరించనుంది.

ఎలెవన్ (Eleven)

ప్లాట్‌ఫామ్: ఆహా / టెంట్‌కొట్ట (Tentkotta)
విడుదల తేదీ: జూన్ 13, 2025
జోనర్: క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
విశేషాలు: టాలీవుడ్‌ స్టార్‌ నవీన్ చంద్ర ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఒక పోలీసు అధికారి ప్రమాదకరమైన హంతకుడిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఆసక్తిగా చిత్రీకరించారు. క్రైమ్‌ లవర్స్‌కి ఇది విపరీతంగా నచ్చుతుంది. 

బ్లైండ్ స్పాట్ (Blind Spot)

ప్లాట్‌ఫామ్: ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ: జూన్ 13, 2025
జోనర్: మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

ఏస్ (Ace)

ప్లాట్‌ఫామ్: ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ: జూన్ 13, 2025
జోనర్: రొమాంటిక్ క్రైమ్ కామెడీ


ఇతర సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు:

డీడీ నెక్స్ట్ లెవెల్ (DD Next Level) – జీ5 (తమిళం, తెలుగులో అందుబాటులో ఉంది)

పడక్కలం (Padakkalam) – జియో సినిమా/హాట్‌స్టార్ (మలయాళం, తెలుగు)

కేసరి చాప్టర్ 2 (Kesari Chapter 2) – జియో హాట్‌స్టార్ (హిందీ, తెలుగు డబ్బింగ్)

డియర్ ఉమా (Dear Uma) – సన్ నెక్స్ట్ 

ఆ ఒక్కటి అడక్కు (Aa Okkati Adakku) – ETV విన్ 

ప్రేమంటే ఇది కధ (Premante Idhi Kadha) – ETV విన్

దేవిక & డానీ (Devika & Danny) – జియో సినిమా/హాట్‌స్టార్ (తెలుగు కామెడీ-హారర్-ఫాంటసీ వెబ్‌ సిరీస్)

పైన తెలిపిన సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు మీకు నచ్చిన జోనర్‌ను ఎంచుకుని ఎంజాయ్‌ చేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News