Monday, June 16, 2025
Homeనేషనల్Rapido Driver Attack on women: యువతిపై రాపిడో డ్రైవర్‌ దాడి.. నెటిజన్ల ఆగ్రహం!

Rapido Driver Attack on women: యువతిపై రాపిడో డ్రైవర్‌ దాడి.. నెటిజన్ల ఆగ్రహం!

Rapido Driver Attack on women: బెంగళూరులో రాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ యువతిపై దాడి చేశాడు. తాను బుక్ చేసుకున్న కెప్టెన్‌ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడనే కారణంగా డ్రైవర్‌తో ఆ యువతి గొడవకు దిగింది. బైక్‌ ఆపిన దిగిన తర్వాత డబ్బులు చెల్లించడానికి యువతి నిరాకరించడంతో సహనం కోల్పోయిన కెప్టెన్‌ ఆమెపై దాడి చేశాడు. డ్రైవర్ చెంపదెబ్బ కొట్టడంతో యువతి అమాంతం నేలపై పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ ఉదాంతాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. రైడ్‌ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా బైక్ నడపడంతో యువతి బెంబేళెత్తినట్లు సమాచారం. అయితే దీనిపై పదే పదే అభ్యంతరం చెప్పిన కెప్టెన్‌ పట్టించుకోలేదని యువతి వాపోయింది. ఇదే క్రమంలో డ్రైవర్, యువతి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక వారు దిగాల్సిన లొకేషన్‌కి చేరుకున్న అనంతరం ర్యాష్ డ్రైవింగ్‌కు నిరసనగా యువతి డబ్బులు ఇవ్వనని తేల్చిచెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన డ్రైవర్‌ ఆమెతో గొడవకు దిగాడు. 

- Advertisement -

అంతటితో ఆగకుండా యువతిపై దాడికి పాల్పడ్డాడు. అతడు కోపంతో చెంపదెబ్బ కొట్టడంతో యువతి అక్కడికక్కడే నేలపై కుప్పకూలింది. ఈ సంఘటన అక్కడి వారిని ఆశ్యర్యానికి గురిచేసింది. అనంతరం వివరాలు తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నాయిని.. బైక్ ట్యాక్సీ సర్వీసులు కస్టమర్లపై చేయి చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దేశంలో టాక్సీ వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య ఓ యువతి క్యాబ్‌ డ్రైవర్‌కి డబ్బు చెల్లించలేదు. ఈ ఘటనలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే కస్టమర్లు సైతం బైక్‌ లేదా ఆటోను బుక్‌ చేసుకున్న తర్వాత లొకేషన్‌కి రీచ్‌ అవ్వగానే క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. దీనివల్ల టాక్సీ డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు టాక్సీ లేదా ర్యాపిడో కెప్టెన్లపై జాలి చూపాలని అంటుంటే మరికొందరు మాత్రం బూతులు తిడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News