Sunday, November 16, 2025
HomeNewsShocking Twist: రెండ్రోజుల ముందే హెచ్చరించిన జర్నలిస్ట్ కుట్ర కోణంలో దర్యాప్తు ?

Shocking Twist: రెండ్రోజుల ముందే హెచ్చరించిన జర్నలిస్ట్ కుట్ర కోణంలో దర్యాప్తు ?

Journalist Warned Two Days Prior : అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి రెండు రోజుల ముందే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో “భారీ విమాన ప్రమాదం జరగనుంది” అంటూ చేసిన పోస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. “భారీ విమాన ప్రమాదం జరగనుంది ఓ రాజకీయ నేత మరణిస్తారు” అంటూ ఆయన హెచ్చరించడం.. ఆ తర్వాత సరిగ్గా అలాంటి ఘటనే చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది యాదృచ్ఛికమా..?లేదా కుట్రలో భాగమా? ఇంతకీ ఆయన ఎవరు? ఏమని పోస్ట్ చేశారో తెలుసుకుందాం.

ఆ హెచ్చరిక వెనుక అసలు రహస్యం ఏమిటి?

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి రెండు రోజుల ముందే, బిహార్‌లోని పట్నాకు చెందిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. “మరో రెండు రోజుల్లో ప్లేన్ క్రాష్ లాంటి భారీ విమాన ప్రమాదం జరగబోతుంది” అని, “దీంతో పాటు ఓ రాజకీయ నేత మరణ వార్త వింటారు” అని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించినట్లు వార్తలు రావడంతో, ఆ జర్నలిస్ట్‌కు ముందే ఎలా తెలిసిందన్న ప్రశ్నలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన ఏ సోర్స్ ఆధారంగా ఈ పోస్ట్ చేశారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

2 రోజల ముందే సోషల్​ మీడియాలో పోస్ట్ :
బిహార్​ పట్నాకు చెందిన ఓ జర్నలిస్ట్ భారీ విమాన ప్రమాదం జరగనుందని హెచ్చరించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి రెండు రోజల ముందే సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. మరో రెండు రోజుల్లో ప్లేన్​ క్రాష్ లాంటి భారీ విమాన ప్రమాదం జరగబోతుందని చెప్పారు. దీంతో పాటు ఓ రాజకీయ నేత మరణ వార్త వింటారని తెలిపారు. ఆయన పోస్ట్ చేసిన నేపథ్యంలో ఏ సోర్స్ ఆధారంగా పోస్ట్ చేశారు? అన్న ప్రశ్న తలెత్తింది. నిజంగానే ఆయనకు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణిస్తారని తెలుసా? అన్న కోణంలో చూస్తున్నారు.

పోస్ట్ డీలీట్​ చేసిన వ్యక్తి :
ఓ వ్యక్తి ప్రమాదంపై చేసిన పోస్ట్‌ను డీలీట్ చేసినా, ఒక నెటిజన్ స్క్రీన్‌షాట్ తీసి NIA, కేంద్ర హోం శాఖకు ట్యాగ్ చేసి దర్యాప్తు కోరాడు. దీనిపై బిహార్ పోలీసులు, సైబర్ నిపుణులు స్పందిస్తూ, ఎఫ్‌ఐఆర్ లేదా కేంద్ర ఆదేశాలు వచ్చేవరకు దర్యాప్తు చేయలేమని, అయితే బిహార్ సైబర్ సెల్ తరఫున సదరు వ్యక్తిని ప్రశ్నిస్తామని తెలిపారు.

- Advertisement -


శోకసంద్రంలో అహ్మదాబాద్ నగరం :
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787 (ఏఐ 171) విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది (229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది) మరణించారు.
అంతేకాదు, విమానం బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకర ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కి చేరడంతో అహ్మదాబాద్ నగరం శోకసంద్రంలో మునిగిపోయింది.






సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad