Sunday, June 15, 2025
HomeNewsStress Relief Food: ఎక్కువగా ఆందోళన చెందుతున్నారా.. వెంటనే ఈ ఫూడ్‌ తీసుకోండి అంతా సెట్‌...

Stress Relief Food: ఎక్కువగా ఆందోళన చెందుతున్నారా.. వెంటనే ఈ ఫూడ్‌ తీసుకోండి అంతా సెట్‌ అవుతుంది!

Stress Relief food: ఆందోళన అనేది అత్యంత ప్రబలంగా ఉన్న మానసిక ఆరోగ్య పరిస్థితులలో ఒకటి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు ఏడు శాతం మందిని ఇది ప్రభావితం చేస్తోంది. ఈ కాలంలో ఒత్తిడి, ఆందోళన మానవ జీవితంలో భాగంగా మారిపోయాయి. అయితే ఇది పెద్ద సమస్యేమీ కాదని.. కొన్ని ఆహారపు అలవాట్లను పాటిస్తే  ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆందోళనను తగ్గించుకోవచ్చనని నిపుణులు చెబుతున్నారు. మన ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు మానసిక శాంతిని తీసుకువచ్చే గుణాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. మరి కొన్ని ఆహారాలు మెదడు పనితీరుకు మద్దతు ఇవ్వడంలో, మీ లక్షణాల తీవ్రతను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

1. ఓట్ మీల్: ఓట్ మీల్ వంటి పూర్తి ధాన్యాలు శరీరంలో సెరటొనిన్ స్థాయిని పెంచుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే, బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు ఒత్తిడిని తగ్గించే మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలాలు. ఇవి మెదడులో హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తాయి.

2. పండ్లు: బనానా, ఆవకాడో, బెర్రీల వంటి పండ్లు మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి. ముఖ్యంగా బెర్రీల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల రక్షణకు పనిచేస్తాయి.

3. గ్రీన్ టీ: గ్రీన్ టీ లేదా కామోమైల్ టీ తాగడం వల్ల మానసిక అలసట తగ్గుతుంది. ఇందులో ఉండే ఎల్థియనైన్ అనే పదార్థం ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

4. సాల్మన్ చేప: సాల్మన్ చేప ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్మన్ చేప మెదడుకు సంబంధించి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఐకోసాపెంటెనోయిక్ ఆమ్లం (EPA), డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం (DHA) ఉన్నాయి.

5. డార్క్ చాక్లెట్స్: మీ ఆహారంలో కొంత డార్క్ చాక్లెట్‌ను చేర్చుకోవడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఎపికాటెచిన్, కాటెచిన్ వంటి ఫ్లేవనాల్స్ ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే మొక్కల సమ్మేళనాలు. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి కాకుండా మనసుకూ విశ్రాంతి లభిస్తుంది.


ఇలా పైన చెప్పిన ఆహారాలు తీసుకోవడం వల్ల మీరు ఒత్తిడిని జయించవచ్చు. దీంతో మీరు ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు కాస్త మీ ఆరోగ్యం పైనా దృష్టి పెట్టినట్లు ఉంటుంది. ముఖ్యంగా పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెండుగా ఉండే అవకాశాలు ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News