Tuesday, June 17, 2025
HomeNewsSuperstar Mahesh: పుష్ప‌రాజ్‌గా మ‌హేష్‌.. వీడియో వైర‌ల్‌

Superstar Mahesh: పుష్ప‌రాజ్‌గా మ‌హేష్‌.. వీడియో వైర‌ల్‌

Pushparaj: ‘త‌గ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ క‌థ‌ను డైరెక్ట‌ర్ సుకుమార్ ముందుగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కు చెబితే, ఆయ‌న రిజెక్ట్ చేశాడు. ఆ త‌ర్వాత క‌థ విన్న బ‌న్ని వెంట‌నే ఓకే చెప్ప‌ట‌మే కాదు.. ఏకంగా పుష్ప రెండు భాగాల చిత్రీక‌ర‌ణ కోసం 5 సంత్స‌రాల స‌మ‌యాన్ని కేటాయించిన సంగ‌తి తెలిసిందే. బ‌న్ని పుష్ప సినిమాపై వెచ్చించిన స‌మ‌యం వృథా కాలేదు. పాన్ ఇండియా రేంజ్ స్టార్‌గా రూ.1800 కోట్ల‌కు పైగానే వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా టాప్ రేంజ్‌కు చేరుకోవ‌టం ఒక‌టైతే, మ‌రో విష‌యం.. బ‌న్నీకి నార్త్‌లో మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఆయ‌న‌కు ఫ్యాన్ బేస్ మ‌రింత‌గా పెరిగింది. పుష్ప మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన త‌ర్వాత మ‌హేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఫీలై ఉంటార‌న‌టంలో సందేహం లేద‌. పుష్ప‌రాజ్ వంటి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించి ఉంటే మ‌హేష్ క్రేజ్ ఎలా ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ను మ‌హేష్ వదులుకున్నట్టు వార్తలొచ్చినా, ఇప్పుడు టెక్నాలజీ సాయంతో అలాంటి కలలు నిజమవుతున్నాయనిపించే స్థితికి చేరుకుంది.

ALSO READ: https://teluguprabha.net/news/bollywood-makers-socks-prabhas-the-raja-saab/

ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసిన‌ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వైర‌ల్ వీడియోను గ‌మ‌నిస్తే అందులో పుష్ప సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో మ‌హేష్ బాబు ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా జోడించి, ఆయనే పుష్ప రాజ్ పాత్రలో నటించినట్టుగా రీక్రియేట్ చేశారు. వీడియో చూసిన మ‌హేష్ అభిమానులు తెగ ఖుషీ అవుతూ, ఆ క్లిప్‌ను గట్టిగా షేర్ చేస్తున్నారు. వీడియోలోని మ‌హేష్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ పుష్ప పాత్రకు ఫిట్ అయిందన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇది చూడగానే “ఇలా ఉండేదేంటో..” అన్నంతగా ఫ్యాన్స్ లో ఓ ఫీలింగ్ క‌లుగుతోంది. .

ఇక మ‌హేష్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలోభారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా తాలూకు అంచనాలు ఇప్పుడు మామూలుగా లేవు. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఇండియా జోన్స్ త‌రహాలో ఓ ఫారెస్ట్ అడ్వెంచ‌ర‌స్ మూవీ రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ఆర్.మాధ‌వ‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News