ఉదయాన్నే టీ తాగడం అనేది చాలామందికి ఒక అలవాటు. కొంతమందికి వ్యసనమనే చెప్పవచ్చు. టీ తాగకపోతే అసలు రోజే మొదలు కాదు అని చెప్పేవాళ్ళు కూడా బోలెడు. అయితే ఈ టీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మోతాదుకు మించి తాగితే
తాగితే కొన్ని దుష్ఫలితాలు కూడా ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు.
- Advertisement -
టీ తాగడం వల్ల దుష్ఫలితాలు:
- నిద్రలేమి (Insomnia):
టీ లో క్యాఫీన్ ఉంటుంది. టీని ఎక్కువగా తాగడం వల్ల నిద్ర త్వరగా రాదు. ముఖ్యంగా రాత్రి వేళ తాగితే మీకు పూర్తిగా నిద్రలేని సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. - గ్యాస్ట్రిక్ సమస్యలు (Acidity/Gastric issues):
ఖాళీ కడుపుతో టీ తాగితే పేగులో ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల గ్యాస్, మంట, అలసటగా ఉంటుంది. - ఐరన్ తగ్గిపోవడం (Reduced Iron Absorption):
టీ లో టానిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ సరఫరాను ఆపేస్తాయి. ఇది అనిమియాకు దారి తీయవచ్చు. - పళ్ళపై మచ్చలు పడటం (Stains on Teeth):
టీ ఎక్కువగా తాగడం వల్ల పళ్లపై గోధుమ రంగు మచ్చలు పడతాయి. ఈ మచ్చలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. - తలనొప్పి (Headache):
క్యాఫీన్ ఎక్కువగా తీసుకుంటే కొంతమందికి తలనొప్పి, చలనలేమి వంటి సమస్యలు వస్తున్నట్టు ఇటీవలి సర్వేల్లో తేలుతోంది. - మానసిక అలసట (mental disturbance):
టీ ను రోజుకు 3 నుంచి 4 కప్పుల కన్నా ఎక్కువగా తాగడం అలవాటయితే క్యాఫీన్ ఆధారపడేలా శరీరం మారుతుంది. ఆ సమయంలో టీ లేకపోతే అలసట, చిరాకు కలగవచ్చు. - రక్తపోటు మార్పులు (Blood Pressure changes):
క్యాఫీన్ వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరగవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
తగిన మోతాదు ఎంత?
రోజుకు 1-2 కప్పుల టీ తాగితే మితమైన మోతాదుగా పరిగణించవచ్చు. ఇక గర్భిణిలు, హార్ట్ పేషెంట్ల విషయానికొస్తే వైద్యుల సలహా మేరకు టీ తాగాలి.