Wednesday, June 11, 2025
HomeNewsTEMPLE FOR CAR: కారుకు గుడి కట్టించిన మెకానిక్.. సెల్ఫీ స్పాట్‌గా మారిన ఇల్లు!

TEMPLE FOR CAR: కారుకు గుడి కట్టించిన మెకానిక్.. సెల్ఫీ స్పాట్‌గా మారిన ఇల్లు!

Temple for the car: బెళగావి జిల్లా చిక్కోడిలోని బేడకిహాళ్ గ్రామంలో ఒక విచిత్రమైన ఇల్లు వెలసింది. దానిపై మూడంతస్తుల పైన ఓ కారు దర్శనమిస్తుంది. ఏంటిదంతా అనుకుంటున్నారా? ఓ మెకానిక్ తన కష్టాల్లో సాయపడిన మారుతి 800 కారును దేవుడిగా భావించి, దానిని ఇంటిపైన ప్రతిష్ఠించాడు. అవును, మీరు విన్నది నిజమే! సూరజ్ అనే ఈ మెకానిక్.. ఈ కారును కేవలం ఒక వాహనంగా కాకుండా, తన జీవితాన్ని మార్చిన దైవంగా భావిస్తున్నాడు.

కష్టకాలంలో తోడైన కారు.. దేవుడిలా మారి…

సూరజ్ మహారాష్ట్రలోని పుణెలో నాలుగేళ్లు మెకానిక్‌గా పనిచేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఒక గ్యారేజీ పెట్టాలనే ఆశతో రూ.20 వేలకు ఓ మారుతి 800 కారును కొన్నాడు. ఆ కారుతో డ్రైవింగ్ శిక్షణ ఇస్తూ వచ్చిన డబ్బుతో ఇల్లు కొన్నాడు, గ్యారేజీ కూడా ప్రారంభించాడు. తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఈ ఎరుపు రంగు కారును అమ్మడం ఇష్టం లేక, దాన్ని తన మూడంతస్తుల ఇంటిపైకి చేర్చాడు. ఈ కార్ తన దేవుడని, ఆర్థికంగా స్థిరపడటానికి ఇదే కారణమని సూరజ్ చెబుతున్నాడు.

సెల్ఫీ స్పాట్‌గా మార్చి….
ముందు రెండో అంతస్తులో కారును ఏర్పాటు చేశాడు కానీ సరిగా కనిపించలేదట. దీంతో రూ.3 లక్షలు ఖర్చు చేసి మరీ మూడంతస్తుల పైన కారును ఎక్కించాడు. ఇక అప్పటి నుంచి అది మామూలు కారు కాదు, ఏకంగా సెల్ఫీ స్పాట్‌గా మారిపోయింది. ప్రతి అమావాస్య, పౌర్ణమి, దసరా పండుగలకు ఈ కారుకు ప్రత్యేక పూజలు చేస్తూ తన భక్తిని చాటుకుంటున్నాడు. “నా ఇల్లు సెల్ఫీ స్పాట్‌గా మారడం చూసి చాలా ఆనందంగా ఉందినిని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News