Saturday, November 15, 2025
HomeతెలంగాణTS CPGET 2025: తెలంగాణలో పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TS CPGET 2025: తెలంగాణలో పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TS CPGET 2025 Notification: తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి టీఎస్‌ సీపీగెట్‌ 2025 కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా .. జులై 17 వ తేదీ వరకు కొనసాగుతోంది. ఆలస్య రుసుముతో జులై 28 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. కాగా ఈ పరీక్షలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనుండగా.. మొత్తం అన్ని యూనివర్సిటీల్లో కలిపి.. 46,742 సీట్లు ఉన్నాయి.
పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

- Advertisement -

ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ ) నిర్వహిస్తున్న ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్ష (టీఎస్‌ సీపీజీఈటీ) ప్రతీ ఏడాది పరీక్షను నిర్వహిస్తోంది.

ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో.. దాదాపు 297 పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 51 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఇతర సమాచారాన్ని..
www.cpget.tsche.ac.in
www.osmania.ac.in, www.ouadmissions.com

వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad