తనపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్న వారికీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ప్రస్తుతం థమన్ హావ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు చిన్న హీరోలు థమన్ కోసం పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు అగ్ర హీరోలు , దర్శకులు వరుసపెట్టి థమన్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం థమన్ చేతిలో అరడజను కు పైగా పెద్ద చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ ల గుంటూరు కారం.
కాగా ఈ సినిమా నుండి థమన్ ను తప్పించారనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఈ ప్రచారం చూసి నిజం అనుకోవడం స్టార్ట్ చేసారు. అయితే ఈ విషయం థమన్ వరకు వెళ్లడం తో ఆగ్రహం వరుస కౌంటర్లు ఇచ్చాడు. అరటిపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివని, కడుపు మంట చల్లారుస్తుందని తమన్ తొలుత ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. అందులో ”రేపటి నుంచి నా స్టూడియోలో బటర్ మిల్క్ (మజ్జిగ) స్టాల్ పెడుతున్నా. మజ్జిగను ఉచితంగా అందిస్తా. కడుపు మంట సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళకు స్వాగతం. మీ రోగాన్ని తగ్గించుకోండి. గుడ్ నైట్! నాకు చాలా పని ఉంది. నా సమయాన్ని వృథా చేయవద్దు. అలాగే, మీ సమయాన్ని వృథా చేసుకోకండి. అరటిపళ్ళు తిని ప్రశాంతంగా ఉండండి” అని పేర్కొన్నారు