Sunday, November 16, 2025
HomeNewsGuntur : కుక్కకు కోడిమాంసం పెట్టి.. భారీ దోపిడీ

Guntur : కుక్కకు కోడిమాంసం పెట్టి.. భారీ దోపిడీ

కుక్కకు కోడిమాంసం పెట్టి.. ఓ కంపెనీలో భారీ దోపిడీ చేశారు. ఈ ఘటన గుంటూరులోని ఓ మిర్చి ఎక్స్ పోర్ట్స్ లో జరిగింది. దోపిడీ దొంగలు చేసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటప్పయ్య కాలనీ లాల్ పురం రోడ్డు చివరలో ఓ మిర్చి కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుండి మలేషియా సహా పలు దేశాలకు మిర్చి ఎగుమతులు చేస్తుంటారు. ఆ కంపెనీపై దోపిడీ దొంగలు కన్నేశారు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. అర్థరాత్రి దాటాక ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చారు. వాచ్ మన్ ఆవులయ్యను కట్టేసి.. చంపేస్తామని బెదిరించారు.

- Advertisement -

ఒకడు ఆఫీస్ రూమ్ తాళం పగలగొట్టి అక్కడున్న సొమ్మును మూటగట్టుకుని బయటికొచ్చాడు. ఇంతలో కుక్క అరవడంతో.. దానికి చికెన్ ముక్కలేసి నోరు మూయించారు. ముక్కలు తినడంలో కుక్క బిజీగా ఉండగా, ఆ దొంగలిద్దరూ బైక్ పై పారిపోయారు. వాచ్ మన్ ద్వారా సమాచారం అందుకున్న కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంపెనీ నుండి సుమారు రూ.20 లక్షలకు పైగా సొమ్మును దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad