టయోటా కార్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ వేరు. ఈ కంపెనీ నుంచి ఇన్నోవా క్రిస్టా అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీగా ఉంది. ఈ కారు మార్కెట్‌లో రోజు రోజుకు తన డిమాండ్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన మే గణాంకాల ప్రకారం ఈ కారు అదరగొట్టింది. మే 2025లో మొత్తం 8,882 యూనిట్ల ఇన్నోవా ఎంపీవీలు సేల్ అయ్యాయి.ఇది గత ఏడాది మే 2024లో సేల్ అయిన 8,548 యూనిట్లతో పోలిస్తే ఇది 4% అమ్మకాలు పెరిగాయి. ఇదే కారుని ఏప్రిల్ 2025లో 7,699 మంది కొనుగోలు చేశారు.
ఈ ఇన్నోవా ఎంపీవీ ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో రెండు వేరియంట్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇందులోని ఇన్నోవా హైక్రాస్ ఇన్నోవా క్రిస్టా రెండూ కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వినియోగదారులు తమ ప్రాధాన్యతలను బట్టి వీటిని ఎంచుకుంటున్నారు.
టయోటా ఇన్నోవా క్రిస్టా: ఈ పాపులర్ ఎంపీవీ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు ప్లాటినం వైట్ పర్ల్, సూపర్ వైట్, సిల్వర్ మెటాలిక్, బ్లాక్ మైకా వంటి కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇందులోని 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ మంచి ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. అయితే ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 7గురు హాయిగా వెళ్లవచ్చు.
ఈ క్రిస్టా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 7 ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) మరియు పార్కింగ్ సెన్సార్‌లను కంపెనీ అందించింది. ఇది చాలా మంది పొలిటీషియన్స్‌కి ఫేవరెట్ వెహికిల్‌గా ఉంది.
ఇన్నోవా హైక్రాస్: ఇందులో ఇన్నోవా హైక్రాస్ రూ. 20 లక్షల నుంచి 32 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ప్రైజ్ వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కారు VX, VX(O) అలాగే ZX అనే ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఇది వైట్ పర్ల్, బ్లాక్ మైకా, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇది 2.0-లీటర్ 4-సిలిండర్ నేచూరల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా పవర్‌ఫుల్ 2.0-లీటర్ 4-సిలిండర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్‌తో వస్తుంది. రెండూ కూడా CVT గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటాయి. ఇందులోని హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు 21 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 లేదా 8 మంది ప్రయాణీకులకు హాయిగా వెళ్లవచ్చు. లగేజీని క్యారీ చేయడం కోసం ఇందులో 300 లీటర్ల భారీ బూట్ స్పేస్ కలదు.
ఫీచర్ల విషయానికి వస్తే 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ మరియు ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో పాటు 360-డిగ్రీల కెమెరా కలదు.