Natural Star Nani: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయటానికి మేకర్స్ నిర్ణయించుకుని డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. అంతా బాగుందని అనుకంటున్న తరుణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. దీంతో రామ్ చరణ్, నాని మధ్య క్లాష్ ఉంటుందా? ఉండదా? అనే వార్తలు వినిపిస్తూ రాసాగాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ షూటింగ్ పలు కారణాలతో తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇది సినిమా రిలీజ్ డేట్ మీద ప్రభావం చూపుతుందనే వార్తలు ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
ది ప్యారడైజ్.. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కొన్ని కీలక పాత్రల కోసం నటుల డేట్స్ అందుబాటులో లేకపోవడం, కొన్ని సెట్‌ల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉండటంతో షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లటం లేదని సమాచారం. దీంతో చిత్ర యూనిట్ తాత్కాలిక బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం. జూలై లేదా ఆగస్టులో మళ్లీ చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తోంది. స్పీడుగా జరగాల్సిన షూటింగ్ ఆగటంతో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మార్చి 26న రిలీజ్ చేయడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల మేరకు ది ప్యారడైజ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నా, పరిస్థితులు సహకరించకపోవడంతో ఆలస్యం తప్పడం లేదట. నాని ప్రస్తుతం ఇతర కమిట్మెంట్స్ తీసుకోకుండా పూర్తి సమయాన్ని ఈ సినిమాకే కేటాయిస్తున్నాడు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/bhuu-antuu-bhuutham-lyrical-song-out-now-in-thammudu-movie/
మరో వైపు ది ప్యారడైజ్ ఓటీటీ రైట్స్ రూ.55 కోట్లకు పైగానే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయనే న్యూస్ అయితే వినిపించింది. కానీ ఇంకా క్లారిటీ రాలేదట. ఇప్పటికే నానితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తోన్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకి ఆసక్తి చూపిస్తున్నా, రేట్ విషయంలో నిర్ణయానికి రాలేదట. అలాగే టాలీవుడ్ విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇవి వార్తలుగానే ఉన్నాయి. ఇంకా కన్‌ఫర్మ్ న్యూస్ అయితే లేదు.
ఇంకా చెప్పాలంటే, పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలు వేర్వేరుగా విడుదలైతే మంచిదనే అందరూ భావిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది ఇప్పటికే మంచి హైప్ సొంతం చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్ల కోసం ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ విషయంలో యూనిట్ పూర్తిగా కాన్ఫిడెంట్‌గా ఉంది. నాని కోసం ఇది కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన హిట్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, పెద్దగా లాంగ్ రన్ ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాపై నాని ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు.